పారా రైఫిల్‌ షూటింగ్‌లో ప్రతిభ

ABN , First Publish Date - 2021-02-08T05:52:30+05:30 IST

కాకినాడ స్పోర్ట్స్‌, ఫిబ్రవరి 7: ఢిల్లీలో నిర్వహించిన పారా రైఫిల్‌ షూటింగ్‌ ఎంపికల్లో జిల్లాకు చెందిన షూటర్‌ రాయల సత్య జనార్ధన్‌ శ్రీధర్‌ ప్రతిభ కనబరిచాడు

పారా రైఫిల్‌ షూటింగ్‌లో ప్రతిభ
పారా రైఫిల్‌ షూటింగ్‌లో ప్రతిభ కనపరిచిన శ్రీధర్‌

కాకినాడ స్పోర్ట్స్‌, ఫిబ్రవరి 7: ఢిల్లీలో నిర్వహించిన పారా రైఫిల్‌ షూటింగ్‌ ఎంపికల్లో జిల్లాకు చెందిన షూటర్‌ రాయల సత్య జనార్ధన్‌ శ్రీధర్‌ ప్రతిభ కనబరిచాడు. 10 మీటర్ల ఆర్‌-4 విభాగంలో రెండోర్యాంక్‌, 10 మీటర్ల ఆర్‌-5లో మూడోర్యాంక్‌ సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయస్థాయిలో రాణించడానికి అడ్వాన్స్‌డ్‌ రైఫిల్‌ షూటింగ్‌ పరికరాలు అవసరమని, దాతలు సాయం చేస్తే సమకూర్చుకుంటానని శ్రీధర్‌ తెలిపాడు. దాతలు 9440398889లో సంప్రదించాలని కోరారు. 

Updated Date - 2021-02-08T05:52:30+05:30 IST