ప్రజల వద్దకే పాలన: మంత్రి కన్నబాబు

ABN , First Publish Date - 2021-10-15T04:52:37+05:30 IST

: ప్రతీ గ్రామంలో ప్రజల వద్దకే పాలన అందించాలన్న లక్ష్యంతో సీఎం జగన్‌ సచివాలయ వ్యవస్థ ఏర్పాటుచేశారని, లక్ష్యసాధన కోసం శాశ్వతభవనాలను నిర్మిస్తున్నట్లు మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు.

ప్రజల వద్దకే పాలన: మంత్రి కన్నబాబు

సర్పవరం జంక్షన్‌, అక్టోబరు 14: ప్రతీ గ్రామంలో ప్రజల వద్దకే పాలన అందించాలన్న లక్ష్యంతో సీఎం జగన్‌ సచివాలయ వ్యవస్థ ఏర్పాటుచేశారని, లక్ష్యసాధన కోసం శాశ్వతభవనాలను నిర్మిస్తున్నట్లు మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. గురువారం రమణయ్యపేట మండల పరిషత్‌ కార్యాలయం పక్కన గల స్థలంలో రూ. 50 లక్షల నిధులతో నిర్మించనున్న షాపింగ్‌ కాంప్లెక్స్‌ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం రాయుడుపాలెంలో గ్రామ సచివాలయం-2 నూతన భవనాన్ని ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సచివాలయ, వలంటీర్ల వ్యవస్థలు దేశంలోనే అరుదైన వ్యవస్థలన్నారు. కార్యక్రమంలో కాకినాడ రూరల్‌, కరప జడ్పీటీసీలు నురుకుర్తి రామకృష్ణ, యాళ్ల సుబ్బారావు, ఏఎంసీ ఛైర్మన్‌ గీసాల శ్రీను, వైస్‌ ఎంపీపీ శిరీష, ఎంపీడీవో పి. నారాయణమూర్తి, తహశీల్దార్‌ వీరవల్లి మురార్జీ,  పాల్గొన్నారు.



Updated Date - 2021-10-15T04:52:37+05:30 IST