పంటవిరామ ఉద్యమం ప్రతిపక్షం సృష్టే

ABN , First Publish Date - 2021-07-13T05:21:50+05:30 IST

పంట విరామ ఉద్య మం రైతుల నుంచి వచ్చింది కాదని, ప్రతిపక్ష తెలుగు దేశంపార్టీ నాయకులు సృష్టించిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ ఆరోపించారు.

పంటవిరామ ఉద్యమం ప్రతిపక్షం సృష్టే

 మంత్రి పినిపే విశ్వరూప్‌

అమలాపురం టౌన్‌, జూలై 12: పంట విరామ ఉద్య మం రైతుల నుంచి వచ్చింది కాదని, ప్రతిపక్ష తెలుగు దేశంపార్టీ నాయకులు సృష్టించిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ ఆరోపించారు. రైతాంగం సమస్యలను ఎదుర్కొంటున్న మాట వాస్తమే నని అయితే వాటి పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని వివరించారు. అమలాపురం సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం అధికారులు, రైతులతో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం ముమ్మిడి వరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్‌తో కలసి విలే ఖరుల సమావేశంలో మంత్రి విశ్వరూప్‌ మాట్లాడారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రైతాంగ సమస్యలపై ఆ పార్టీ ముసుగులో ఉన్న రైతు నాయకులు ఎప్పుడూ రోడ్డెక్కలేదన్నారు. రైతాంగ సమస్యలపై పార్టీలకు అతీ తంగా ఉద్యమించాలని, అధికారంలో ఉన్నప్పుడు ఒక లా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా వ్యవహరించడం తగదన్నారు. పంట విరామ ఉద్యమాన్ని తొలుత ఉప్పలగుప్తం మండలం గోపవరంలో ప్రారంభించాలని అయితాబత్తులఉమామహేశ్వరరావు  ప్రయత్నించారని అనంతరం అల్లవరంలోను రైతులు సహకరించలేద న్నారు. ముమ్మిడివరం మండలం అయినాపురంలో ప్ర తిఏటా 3వేల ఎకరాలు ముంపు బారినపడి రైతులు పంట నష్టపోతున్నమాట వాస్తమేనని ఆయన వివరిం చారు. దాంతో ఈ ఏడాది అమలాపురం డ్రైయిన్‌, ఓల్డ్‌ అయినాపురం డ్రైయిన్ల కింద ఉన్న పంట పొలాల రైతు లు పంట విరామాన్ని ప్రకటించేలా టీడీపీ నాయకులు రెచ్చగొట్టారని ఆరోపించారు. నక్కలకాల్వ డ్రైయిన్‌ను పునరుద్ధరించడంతోపాటు రంగరాజుకోడుకు సం బంధి ంచి మైనర్‌ డ్రైయిన్‌ను డ్రెడ్జింగ్‌చేసి ఆధునికీక రించేం దుకు రూ.30లక్షల సీఎస్‌ఆర్‌ నిధులు మంజూరు చేస్తు న్నట్టు మంత్రి ప్రకటించారు. రెండు మూడు రోజుల్లో పనులు ప్రారంభిస్తామన్నారు. సమీక్షా సమావేశంలో గోదావరి డెల్టాసిస్టమ్‌ చీఫ్‌ ఇంజనీర్‌ ఎన్‌.పుల్లారావు, జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ, ట్రైనీ కలెక్టర్‌ గీతాంజలిశర్మ, ఆర్డీవో వసంతరాయుడు పాల్గొన్నారు.



Updated Date - 2021-07-13T05:21:50+05:30 IST