ఉద్రిక్తతల నడుమ ఎస్‌.అగ్రహారం పంచాయతీ ఏకగ్రీవం

ABN , First Publish Date - 2021-02-05T06:20:48+05:30 IST

ఉద్రిక్తతల నడుమ మండలంలోని ఎస్‌.అగ్రహారం పంచాయతీ ఎన్నిక ఏకగ్రీవమైంది.

ఉద్రిక్తతల నడుమ ఎస్‌.అగ్రహారం పంచాయతీ ఏకగ్రీవం

 రౌతులపూడి, ఫిబ్రవరి 4: ఉద్రిక్తతల నడుమ మండలంలోని ఎస్‌.అగ్రహారం పంచాయతీ ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ పంచాయతీ నుంచి వైసీపీ మద్దతుదారుడు సర్నం శ్రీను, వైసీపీ రెబెల్‌ అభ్యర్థిగా కొల్లు అప్పలరాజు నామినేషన్లు వేశారు. అప్పలరాజు రెండు సెట్ల పత్రాలను సమర్పించగా ఉపసంహరణలో ఒక సెట్‌ను విత్‌డ్రా చేసుకున్నారు. రెండో సెట్‌ పరిశీలనలో ఉంటుందని భావించారు. అయితే మొదటిది విత్‌డ్రా కావడంతో రెండోది కూడా విత్‌డ్రా అయిపోయినట్టు అధికారులు ప్రకటించారు. దీంతో అప్పలరాజు తన నామినేషన్‌ పత్రాలను చింపివేసినట్టు స్టేజ్‌-1 అధికారికి తెలిపారు. తాను రెండో సెట్‌ను విత్‌డ్రా చేసుకోనప్పనటికీ అధికారులు ఆ నామినేషన్‌ను కూడా రద్దు చేయడంపై ఆయన ప్రశ్నిస్తూ ఆందోళనకు దిగారు. దీంతో కేంద్రం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. జరిగిన విషయంపై పోలీసుల సమక్షంలో ఎన్నికల అధికారులు చర్చించారు. సర్నం శ్రీను నామినేషన్‌ ఒక్కటే పోటీలో ఉండడడంతో ఆ పంచాయతీ సర్పంచ్‌ అభ్యర్థిగా ఎన్నిక ఏకగ్రీవమైనట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు.

Updated Date - 2021-02-05T06:20:48+05:30 IST