ఆక్సిజన్‌ ‘సేవ’లకు బ్రేక్‌

ABN , First Publish Date - 2021-05-08T06:28:57+05:30 IST

కరోనా బారిన పడి హోంఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్న బాధితులకు అత్యవసర పరిస్థితుల్లో ఆక్సిజన్‌ అందించే స్వచ్ఛంద సంస్థల సేవలకు బ్రేక్‌ పడింది.

ఆక్సిజన్‌ ‘సేవ’లకు బ్రేక్‌
సఖినేటిపల్లి చిరు-పవన్‌ సేవాసమితి సిద్ధంచేసిన సిలిండర్లు

  • బయటి సిలిండర్లకు ఆక్సిజన్‌ ఫిల్లింగ్‌ నిలిపివేయాలని ఆదేశాలు
  • హోం ఐసోలేషన్‌లో ఉన్న బాధితులకు అందని ఆక్సిజన్‌ సేవలు
  • పలు స్వచ్ఛంద సంస్థల ఆక్సిజన్‌ సరఫరా సేవలకూ విఘాతం

(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

కరోనా బారిన పడి హోంఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్న బాధితులకు అత్యవసర పరిస్థితుల్లో ఆక్సిజన్‌ అందించే స్వచ్ఛంద సంస్థల సేవలకు బ్రేక్‌ పడింది. ప్రైవేటు వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలు, వివిధ అసోసియేషన్లు తీసుకువచ్చే సిలిండర్లకు ఆక్సిజన్‌ సరఫరా చేయవద్దని జిల్లా అధికారులు ఆదేశించడంతో గత రెండ్రోజుల నుంచి స్వచ్ఛంద సంస్థల సేవలకు పూర్తిగా బ్రేక్‌ పడింది. సేవా దృక్పథంతో దాతల సహకారంతో నిరు పేద లకు అత్యవసరంగా ఆక్సిజన్‌ అందించడం ద్వారా వందలాది మంది ప్రాణాలకు భరోసాగా నిలుస్తున్న స్వచ్ఛంద సంస్థలకు ఆక్సిజన్‌ అందించే ఏర్పాట్లు చేయాలని అటు బాధితులు ఇటు సంస్థల ప్రతినిధులు ముక్తకంఠంతో వేడుకుంటున్నారు. గత ఏడాది కరోనా ఉధృతి సమయంలో ఎన్నో స్వచ్ఛంద సంస్థలు రాజకీయాలకు అతీతంగా సేవలు అందించాయి. ఈ క్రమంలోనే ఇళ్ల వద్దే ఉండి చికిత్స పొందే కరోనా బాధితుల కోసం కొన్ని సంస్థలు ప్రాణవాయువును అందించే సిలిండర్లను సరఫరా చేయడం ప్రారంభించారు. ఇప్పుడు ఇవి కోనసీమలో వందలాది మందికి  ప్రాణవాయువును అందిస్తున్నాయి. ముఖ్యంగా జన సేన పార్టీ, చిరు-పవన్‌ సేవాసమితులు, యర్రా బలరామమూర్తి కోనసీమ ఐబ్యాంకుతో పాటు విశ్వహిందూపరిషత్‌, భజరంగ్‌దళ్‌ సంస్థలు, రియల్‌ ఎస్టేట్‌ ఏజన్సీలు, వివిధ కుల సంఘా లు ఇలా ఎవరికి వారే ఆక్సిజన్‌ సిలిండర్ల ద్వారా కరోనా బాధితులకు అత్యవసర సమ యాల్లో సేవలు అందిస్తున్నారు. హోంఐసోలేషన్‌లో ఉన్న బాధితులు ముందస్తుగా ప్రాణ వాయువును సిద్ధంచేసుకోవడం ద్వారా ఇప్పటివరకు వందల సంఖ్యలో ప్రాణాలను ఈ సంస్థల ప్రతినిధులు కాపాడగలిగారు. కాగా అమలాపురం, పాలకొల్లులో ఉండే ఆక్సిజన్‌ నింపే కేంద్రాల నుంచి స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు వ్యక్తులు అందించే సిలిండర్లకు ఆక్సి జన్‌ నింపవద్దని ఆదేశాలు ఇవ్వడంతో వీరు అందించే సేవలకు బ్రేక్‌ పడింది. గతంలో తహశీల్దార్ల సిఫారసులపై ఆక్సిజన్‌ నింపేవారు. ఇప్పుడు జిల్లా అధికారులు అనుమతిస్తే తప్ప నింపలేమని చేతులెత్తేయడంతో బ్రేక్‌ పడిందని మలికిపురంలోని చిరు- పవన్‌ సేవాసమితికి చెందిన పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురు వారం మలికిపురం వెళ్లిన కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డిని కలసి వారు వినతి పత్రం ఇచ్చారు. ఇటువంటివేమీ పెట్టవద్దని, ప్రస్తుతం ఆసుపత్రులకే ఆక్సిజన్‌ సర ఫరా చేస్తున్నామని చెప్పడంతో సంస్థల ప్రతినిధులు కంగుతిన్నారు. ఆసుప త్రుల వరకు వెళ్లే బాధితులకు కూడా అంబులెన్సుల్లో ఆక్సిజన్‌ సరఫరా చేయ డంతోపాటు ఇళ్ల వద్ద చికిత్స పొందే బాధితులకు, కాకినాడ వంటి ప్రాంతాల కు తరలించే బాధితులకు తమ సంస్థలే ఆక్సిజన్‌ సరఫరా చేస్తున్నాయని చెబుతున్నారు. ఈ నిర్ణయం వల్ల స్వచ్ఛంద సంస్థల వద్దనున్న సిలిండర్లకు ఆక్సిజన్‌ సరఫరా నిలిచిపోవడంతో హోంఐసోలేషన్‌లో ఉన్న బాధితులు ఆం దోళన చెందుతూ ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. గుర్తింపు పొందిన సంస్థలకైనా సిలిండర్లు సరఫరా చేసేలా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.

Updated Date - 2021-05-08T06:28:57+05:30 IST