అమరవీరుల ఆశయ సాధనకు ఉద్యమించాలి

ABN , First Publish Date - 2021-03-24T06:28:27+05:30 IST

అమరవీరుల ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరూ ఉద్యమించాలని పీడీఎస్‌యూ రాష్ట్ర నాయ కుడు రేవు తిరుపతిరావు పిలుపునిచ్చారు.

అమరవీరుల ఆశయ సాధనకు ఉద్యమించాలి

అమలాపురం, మార్చి 23: అమరవీరుల ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరూ ఉద్యమించాలని పీడీఎస్‌యూ రాష్ట్ర నాయ కుడు రేవు తిరుపతిరావు పిలుపునిచ్చారు. మద్దాలవారిపేటలో మంగళవారం రాత్రి పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ల వర్థంతిని నిర్వహించారు. విద్యార్థులు అమరవీరులకు నివాళులర్పిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిం చారు. పీడీఎస్‌యూ డివిజన్‌ సంఘ అధ్యక్షుడు ఎం.శ్రీను, జి.చిరంజీవి, కె.రవి, పెట్టా శ్రీను, బి.నందు, ఆది, నవీన్‌, అభిషేక్‌ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఐద్వా జిల్లా కార్యదర్శి సీహెచ్‌ రమణి ఆధ్వర్యంలో జరుగుతున్న మహిళా శిక్షణా తరగతుల్లో భాగంగా అమరవీరులకు ఘనంగా నివా ళులర్పించారు. బండారులంకలో డివిజన్‌ కార్యదర్శి టి.నాగ వరలక్ష్మి ఆధ్వర్యంలో అమరవీరులకు చండీప్రియ, కళా వతులు పూలమాలలువేసి నివాళులర్పించారు. 

కపిలేశ్వరపురం: స్థానిక దేవీసెంటర్‌ ప్రాథమిక పాఠశాలలో విజయం చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో భగత్‌సింగ్‌ వర్ధంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ట్రస్టు నిర్వాహకులు రెడ్డి ఆశిష్‌, గొడవర్తి వీరు, నల్లమిల్లి సూర్యమణికంఠ 70మంది విద్యార్థులకు టీ షర్టులు, పుస్తకాలు, పెన్నులు అందజేశారు. కార్యక్రమంలో హెచ్‌ఎం అంబటి శ్రీనివాస్‌, ఉపాధ్యాయులు అగస్తేశ్వరరావు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. 

భగత్‌సింగ్‌ వర్ధంతి

ఆత్రేయపురం: స్వాతంత్ర సమరయోధుడు భగత్‌సింగ్‌ వర్ధంతిని వాడవాడలా నిర్వహించారు. మంగళవారం మండల పరిషత్‌ కార్యాలయంలో భగత్‌సింగ్‌ చిత్రపటానికి ఎంపీడీవో నాతి బుజ్జి, ఎంఈవో ప్రసాదరావు, ఈవోపీఆర్డీ శ్రీనివాస్‌, సిబ్బంది పూలమాలలువేసి నివాళులర్పించారు. 

భగత్‌సింగ్‌కు ఘన నివాళి

ఆలమూరు: స్వాతంత్ర సమరయోధుడు భగత్‌సింగ్‌ వర్ధంతి మంగళవారం ఆలమూరులో నిర్వహించారు. స్థానిక సమతా స్వచ్ఛంద సంస్థ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో భగత్‌సింగ్‌ చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కామ్రేడు ఏసురాజు, నాయకులు కె.రామకృష్న, శ్యామ్‌, చంద్రరావు, మనోహర్‌, సందీప్‌, రమణయ్య, ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-03-24T06:28:27+05:30 IST