ఓటీఎస్‌ కట్టకుండా చర్యలు

ABN , First Publish Date - 2021-12-08T05:55:35+05:30 IST

ఏజన్సీలోని గృహనిర్మాణ లబ్ధిదారులు వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌(ఓటీఎస్‌) కట్టకుండా గిరిజనులను పూర్తి హక్కుదారులను చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్‌ అన్నారు.

ఓటీఎస్‌ కట్టకుండా చర్యలు

గంగవరం, డిసెంబరు 7: ఏజన్సీలోని గృహనిర్మాణ లబ్ధిదారులు వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌(ఓటీఎస్‌) కట్టకుండా గిరిజనులను పూర్తి హక్కుదారులను చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్‌ అన్నారు. ఎమ్మెల్సీ అయిన తర్వాత తొలిసారిగా గంగవరం విచ్చేసిన ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. గిరిజన లబ్ధిదారులు ఆర్థికంగా వెనుకబడిన ఉండడంతో వారి ఇబ్బందులను సీఎం జగన్‌ దృష్టికి తీసుకువెళ్లగా ఓటీ ఎస్‌ కట్టకుండా గిరిజనులను పూర్తి హక్కుదారులను చేసేందుకు అంగీకరించారని త్వరలోనే ఉత్తర్వులు వెలువడతాయన్నారు. ఈ నేపథ్యంలోనే ఏజన్సీలో ఓటీఎస్‌ వసూళ్లు తాత్కాలికంగా నిలుపుదల చేశామన్నారు. ఏజెన్సీలో మంజూరైన రహదారి నిర్మాణాలను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. అర్హులైన వారి రేషన్‌కార్డులు రద్దు చేయబోమని, ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన కుటుంబాలకు మాత్రమే తాత్కాలికంగా కార్డులను రద్దు చేస్తామని ఉదయభాస్కర్‌ చెప్పారు.

Updated Date - 2021-12-08T05:55:35+05:30 IST