‘ఓటీఎస్‌ దురాలోచన కాదు.. దూరాలోచన’

ABN , First Publish Date - 2021-12-25T06:07:08+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం దురాలోచనతో చేసింది కాదని పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని దూరాలోచనతో చేసినదని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ పేర్కొన్నారు.

‘ఓటీఎస్‌ దురాలోచన కాదు.. దూరాలోచన’

అమలాపురం టౌన్‌, డిసెంబరు 24: రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం దురాలోచనతో చేసింది కాదని పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని దూరాలోచనతో చేసినదని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ పేర్కొన్నారు. అమలాపురం బాలయోగి స్టేడియంలోశుక్రవారం ఓటీఎస్‌ పథకం కింద నగదు చెల్లించిన వారికి రిజిష్టర్డ్‌ డాక్యుమెంట్ల పంపిణీ  కార్యక్రమం చేపట్టారు. ముఖ్య అతిథిగా మంత్రి  మాట్లాడారు. ఆర్డీవో ఎన్‌ఎస్‌వీబీ వసంతరాయుడు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రెడ్డి సత్యనాగేంద్రమణి, ఎంపీపీ కుడుపూడి భాగ్యలక్ష్మి, సెంట్రల్‌బోర్డు చైర్మన్‌ కుడుపూడి బాబు, జడ్పీటీసీలు పందిరి శ్రీహరి, గెడ్డం సంపదరావులతో కలసి డాక్యుమెం ట్లు పంపిణీ చేశారు. ఏఎంసీ చైర్మన్‌ బొక్కా ఆదినారా యణ, ఎంపీడీవో ఎం.ప్రభాకరరావు, తహశీల్దార్‌ గెడ్డం రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, కమిషనర్‌ వి.అయ్యప్పనాయుడు,  హౌసింగ్‌ ఈఈ వై.శ్రీనివాస్‌ పాల్గొన్నారు.Updated Date - 2021-12-25T06:07:08+05:30 IST