ఓటీఎస్‌ పేరుతో దోపిడీ: గొల్లపల్లి

ABN , First Publish Date - 2021-12-08T06:09:23+05:30 IST

ఓటీఎస్‌ పేరుతో వైసీపీ ప్రభుత్వం పేద ప్రజల్ని దోపీడీ చేస్తోందని మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావు తీవ్రంగా విమర్శించారు.

ఓటీఎస్‌ పేరుతో దోపిడీ: గొల్లపల్లి

రాజోలు, డిసెంబరు 7: ఓటీఎస్‌ పేరుతో వైసీపీ ప్రభుత్వం పేద ప్రజల్ని దోపీడీ చేస్తోందని మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావు తీవ్రంగా విమర్శించారు. ఓటీఎస్‌పై బలవంతపు వసూళ్లు వద్దని, దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని కోరుతూ తహశీల్దార్‌ బి.ముక్తేశ్వ రరావుకు వినతిపత్రాన్ని మంగళవారం గొల్లపల్లి అందజేశారు. ఈసంద ర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ పేదల ఇళ్లకు వద్దకు అధికా రులను పంపి ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందన్నారు.  డ్వాక్రా సంఘాల్లో ఉన్న మహిళల సొమ్మును ఓటీఎస్‌ పేరుతో దోచుకో వడానికి ప్రభుత్వం దిగజారిందన్నారు. అయినవిల్లి ఎంపీడీవోపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ సర్పంచ్‌ తాతాజీపై చర్యలు తీసుకోవాలన్నారు. ఎంపీపీ కేతా శ్రీనివాస్‌, మాజీ ఏఎంసీ చైర్మన్‌ కాండ్రేగుల సత్యనారాయణమూర్తి, అడబాల సాయిబాబు, రుద్రరాజు శ్రీనివాసరాజు, అడబాల యుగంధర్‌, చాగంటి స్వామి, మానేపల్లి బాలాజీవేమా, తదితరులు పాల్గొన్నారు. 
Updated Date - 2021-12-08T06:09:23+05:30 IST