నగరంలో ఉత్కంఠగా ఓఎన్జీసీ మాక్‌ డ్రిల్‌

ABN , First Publish Date - 2021-08-27T07:20:56+05:30 IST

నగరం గ్రామంలో ఓఎన్జీసీ సైట్‌ వద్ద ఆ సంస్థ మాక్‌డ్రిల్‌ను గురువారం నిర్వహించింది. జాతీయ విపత్తు స్పందన బృందం, జిల్లాపరిపాలనా యంత్రాంగం, గెయిల్‌, స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, మెడికల్‌ సర్వీస్‌ ఆధ్వ ర్యంలో ఈ మాక్‌డ్రిల్‌ నిర్వహించారు.

నగరంలో ఉత్కంఠగా ఓఎన్జీసీ మాక్‌ డ్రిల్‌
ఓఎన్జీసీ మాక్‌డ్రిల్‌లో లీకేజీని అదుపుచేస్తున్న సిబ్బంది..

మామిడికుదురు, ఆగస్టు 26: నగరం గ్రామంలో ఓఎన్జీసీ సైట్‌ వద్ద ఆ సంస్థ మాక్‌డ్రిల్‌ను గురువారం నిర్వహించింది. జాతీయ విపత్తు స్పందన బృందం, జిల్లాపరిపాలనా యంత్రాంగం, గెయిల్‌, స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, మెడికల్‌ సర్వీస్‌ ఆధ్వ ర్యంలో ఈ మాక్‌డ్రిల్‌ నిర్వహించారు. అకస్మాత్తుగా ప్రమాదం సంభవించి గ్యాస్‌ లీకయినట్టయితే దానిని ఏవిధంగా అదుపు చేస్తారో సిబ్బంది కళ్లకు కట్టినట్టు చేసి చూపించారు. అంతే కాకుండా సంఘటనలో ఎవరైనా గాయపడినా, అస్వస్థతకు లోనైనా వారిని హుటాహుటీన వైద్య సిబ్బంది వద్దకు చేర్చడం, వారికి వైద్య సదుపాయం కల్పించడం తదితర అంశాలను చేసి చూపించారు. ఈ కార్యక్రమంలో ఓఎన్జీసీ ఫైర్‌ సర్వీసుకు చెందిన ఆరు ఫైర్‌ ఇంజన్లు, ఐదు అంబులెన్సులు పాల్గొని సంఘటన నిజంగా జరిగిందా అన్న రీతిలో ఉత్కంఠభరితంగా ఈ మాక్‌ డ్రిల్‌ను నిర్వహించి చుట్టుపక్కల ప్రజలకు భద్రతపై భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఓఎన్జీసీ రాజమహేంద్రవరం అసెట్‌ మేనేజర్‌ అమిత్‌నారాయణ మాట్లాడుతూ ఇటువంటి మాక్‌డ్రిల్స్‌ ప్రజల్లో భయాన్ని పొగొట్టేందుకే తమ సంస్థ నిర్వహిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో బి.వసంతరాయుడు, డీఎస్పీ వై.మాధవరెడ్డి, తహశీల్దార్‌ ఎం.సుజాత, రాజోలు సీఐ బి.దుర్గా శేఖర్‌రెడ్డి, నగరం ఎస్‌ఐ షేక్‌ జానీబాషా, సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-27T07:20:56+05:30 IST