ఘనంగా కోటి రుద్రాక్ష మహాయాగ మహోత్సవం

ABN , First Publish Date - 2021-12-26T06:10:57+05:30 IST

పుల్లేటికుర్రు గ్రామంలో శ్రీచౌడేశ్వరిసమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మశ్రీ కారుపర్తి నాగమల్లేశ్వరసిద్ధాంతి ఆధ్వర్యంలో కోటి రుద్రాక్ష మహాయాగ మహోత్సవ పూజలు ఘనంగా ప్రారంభించారు.

ఘనంగా కోటి రుద్రాక్ష మహాయాగ మహోత్సవం

అంబాజీపేట, డిసెంబరు 25: పుల్లేటికుర్రు గ్రామంలో శ్రీచౌడేశ్వరిసమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో  బ్రహ్మశ్రీ కారుపర్తి నాగమల్లేశ్వరసిద్ధాంతి ఆధ్వర్యంలో కోటి రుద్రాక్ష మహాయాగ మహోత్సవ పూజలు ఘనంగా ప్రారంభించారు. ఈసందర్భంగా విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవాచనం, పంచగవ్య, మహన్యాసం, శ్రీరుద్రాభిషేకం, ఇంద్రపశుపత మహామృత్యంజయ హోమం, లక్ష కుంకుమార్చన, శ్రీ సీతారామస్వామి శాంతికల్యాణ మహోత్సవం తదితర పూజలను ఘనంగా నిర్వహించారు.  శ్రీతాళ్ళాయిపాలెం  శైవక్షేత్ర  పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ శివస్వామి వారి ఆశీస్సులతో స్వామి వారికి విశేష పూజలు చేశారు. కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. Updated Date - 2021-12-26T06:10:57+05:30 IST