ఉలిక్కిపడిన ‘ఊబలంక’
ABN , First Publish Date - 2021-12-30T07:15:06+05:30 IST
రావులపాలెం రూరల్, డిసెంబరు 29: సౌదీఅరేబియా దేశం నుంచి వచ్చిన ఓ వ్యక్తికి ఒమైక్రాన్ నిర్ధారణ అయింది. అతనితోపాటు తొలి కాంటాక్టు పర్సన్లుగా ఆయన భార్య, కుమారుడికీ ఒమైక్రాన్ పాజిటివ్ నిర్ధారణ అయింది. రావులపా లెం మండలం ఊబలంకకు చెందిన ఒక వ్యక్తి ఈనెల 15న సౌ

సౌదీ దేశం నుంచి ఈనెల 15న వచ్చిన వ్యక్తికి ఒమైక్రాన్
అతని నుంచి ఇంట్లో భార్య, కుమారుడికీ సోకినట్టు నిర్ధారణ
కేసులు నమోదవడంతో పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు
రావులపాలెం రూరల్, డిసెంబరు 29: సౌదీఅరేబియా దేశం నుంచి వచ్చిన ఓ వ్యక్తికి ఒమైక్రాన్ నిర్ధారణ అయింది. అతనితోపాటు తొలి కాంటాక్టు పర్సన్లుగా ఆయన భార్య, కుమారుడికీ ఒమైక్రాన్ పాజిటివ్ నిర్ధారణ అయింది. రావులపా లెం మండలం ఊబలంకకు చెందిన ఒక వ్యక్తి ఈనెల 15న సౌదీ నుంచి ఇంటికి వచ్చాడు. దీంతో అతడిని పీహెచ్‌సీ వైద్యాధికారి దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో హోంక్వారంటైన్‌లో ఉంచి పరీక్షలు నిర్వహించగా, 18న కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో భార్యకు, కుమారుడికీ కరోనా పరీక్షలు నిర్వహించగా 21న వీరికి కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ముగ్గురికీ ఒమైక్రాన్ (జీనం సీక్వెన్స్) పరీక్షల నిమిత్తం శాంపిల్స్ సేకరించి పంపగా బుధవారం ముగ్గురికీ ఒమైక్రాన్ పాజిటివ్ నిర్ధారణ అయినట్టు జిల్లా వైద్యాధికారుల నుంచి సమాచారం వచ్చింది. దీనిపై స్థానిక పీహెచ్‌సీ వైద్యాధికారి దుర్గాప్రసాద్ ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ సౌదీ నుంచి వచ్చిన వ్యక్తిని ఆరోజు నుంచే హోంక్వారంటైన్‌లో ఉంచి పర్యవేక్షించామని, పరీక్షల్లో ఒమైక్రాన్ నిర్ధారణ అయినట్టు చెప్పారు. కాగా ఒమైక్రాన్ కేసు లు నమోదైన ప్రాంతంలో పంచాయతీ కార్యదర్శి బీవీ ప్రసాద్ ఆధ్వర్యంలో పారిశుధ్య పనులు చేపట్టారు. ఇటు రావులపాలెం మండలంలో ఒమైక్రాన్ కేసులు నమోదయ్యాయన్న వార్త సంచలనం కలిగించింది. కేసులు నమోదైన పరిసర ప్రాంతాల్లో అయితే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కొవిడ్ జాగ్రత్తలు పాటిస్తే చాలని, ఎలాంటి ఆందోళన అక్కర్లేదని వైద్యులు పేర్కొంటున్నారు.