వృద్ధురాలిని హత్య చేసి దోపిడీ

ABN , First Publish Date - 2021-02-06T07:33:05+05:30 IST

వృద్ధురాలిని హత్య చేసి దోపిడీ

వృద్ధురాలిని హత్య చేసి దోపిడీ

రాజమహేంద్రవరం సిటీ, ఫిబ్రవరి 5: రాజమహేంద్రవరం రూరల్‌ మండలం ఆదర్శనగర్‌లో శుక్రవారం ఓ ఇంట్లో దొంగలు ప్రవేశించి వృద్ధురాలిని హత్యచేసి ఆ ఇంట్లో బంగారు ఆభరణాలతో పరారయ్యారు. బొమ్మూరు పోలీసుల కథ నం ప్రకారం.. రాజమహేంద్రవరం ప్రధాన రైల్వేస్టేషన్‌ సమీపంలోని ఆదర్శనగర్‌ లో జంగా నారాయణమ్మ(70) ఓ ఇంట్లో అద్దెకుంటోంది. 30ఏళ్ల క్రితమే ఆమె భ ర్త చనిపోవడంతో ఒంటరిగా ఉంటోంది. శుక్రవారం పక్కింటివారు ఇంటికెళ్లి త లుపు తట్టారు. వెనుకవైపు తలుపులు తెరిచి గదిలో ఆమె విగతజీవిగా పడి ఉం ది. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. ఏఎస్పీ లతామాధురి మృతదేహాన్ని పరిశీలించారు. బొమ్మూరు సీఐ కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-02-06T07:33:05+05:30 IST