చలిమంట అంటుకుని వృద్ధురాలి మృతి

ABN , First Publish Date - 2021-12-25T05:40:58+05:30 IST

చలి మంటలో చిక్కుకుని ఓ వృద్ధురాలు మృతి చెందింది. మండలంలోని శబరి కొత్తగూడెం గ్రామానికి చెందిన పాయం పాపమ్మ (82) చలి తీవ్రంగా ఉండడంతో పూరిగుడిసెలో చలి మంట వేసుకుంది.

చలిమంట అంటుకుని వృద్ధురాలి మృతి

  కూనవరం, డిసెంబరు 24: చలి మంటలో చిక్కుకుని ఓ వృద్ధురాలు మృతి చెందింది. మండలంలోని శబరి కొత్తగూడెం గ్రామానికి చెందిన పాయం పాపమ్మ (82) చలి తీవ్రంగా ఉండడంతో పూరిగుడిసెలో చలి మంట వేసుకుంది. తెల్లవారుజామున ఆమె కప్పుకున్న దుప్పటికి నిప్పంటుకుంది. పాపమ్మతో పాటు పూరి గుడిసె సైతం దగ్ధమైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-12-25T05:40:58+05:30 IST