వృద్ధుడి అదృశ్యంపై ఫిర్యాదు

ABN , First Publish Date - 2021-10-25T05:53:22+05:30 IST

గున్నేపల్లి అగ్రహారానికి చెందిన 60ఏళ్ల వృద్ధుడు కేతా సూర్యనాగ సత్యనారాయణ నెల రోజులుగా కనిపించడంలేదని కుమారుడు ఆదివారం అమలాపురం తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వృద్ధుడి అదృశ్యంపై ఫిర్యాదు

అమలాపురం రూరల్‌, అక్టోబరు 24: గున్నేపల్లి అగ్రహారానికి చెందిన 60ఏళ్ల వృద్ధుడు కేతా సూర్యనాగ సత్యనారాయణ నెల రోజులుగా కనిపించడంలేదని కుమారుడు ఆదివారం అమలాపురం తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటి నుంచి వెళ్లినప్పుడు లేత నీలిరంగు చొక్కా ధరించి ఉన్నట్టు ఫిర్యాదులో వివరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ ఎ.పరదేశి తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు సెల్‌ (9440796562)కు సమాచారం ఇవ్వాలని ఎస్‌ఐ కోరారు. Updated Date - 2021-10-25T05:53:22+05:30 IST