ఆడుతూ..పాడుతూ
ABN , First Publish Date - 2021-11-28T05:47:21+05:30 IST
ఉద్యోగులు పని ఒత్తిళ్లను అధి గమించి అహ్లాదకర, ప్రకృతి రమణీయ వాతావరణంలో మాన సిక ప్రశాంతత పొందేందుకు కార్తీక వన సమారాధన వంటి ఉల్లాసభరిత కార్యక్రమాలు దోహదపడతాయని జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ అన్నారు.

రాజమహేంద్రవరం పుష్కర వనంలో
జిల్లా అధికారుల వన సమారాధన
ఉల్లాసంగా..ఉత్సాహంగా గడిపిన అధికారులు
వివిధ పోటీల నిర్వహణ
దివాన్‌చెరువు,
నవంబరు 27: ఉద్యోగులు పని ఒత్తిళ్లను అధి గమించి అహ్లాదకర, ప్రకృతి రమణీయ
వాతావరణంలో మాన సిక ప్రశాంతత పొందేందుకు కార్తీక వన సమారాధన వంటి
ఉల్లాసభరిత కార్యక్రమాలు దోహదపడతాయని జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్
అన్నారు. జిల్లా అధికారులు, కుటుంబసభ్యుల వన సమారాధన శనివారం దివాన్‌చెరువు
సమీపంలోని గోదావరి పుష్కరవనంలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన
కలెక్టర్ మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాల్లో రోజంతా పాల్గొనడం వల్ల మానసిక
ప్రశాంతత పొందుతారన్నారు. ఈ తరహా కార్యక్రమాలు మున్ముందు కూడా
నిర్వహించనున్నట్టు చెప్పారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన జేసీ
ఎ.భార్గవ్‌తేజ, డీఆర్వో సీహెచ్ సత్తిబాబును కలెక్టర్ అభినందించారు. ఈ
సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లోని విజేతలకు బహుమతులను అందజేశారు.
తొలుత కలెక్టర్ దంపతులు ఉసిరిచెట్టు వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
అనంతరం విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శన, ఆంధ్రా నంది అవార్డు గ్రహీత
సతీష్ మ్యాజిక్ షో నిర్వహించారు. మధ్యాహ్నం భోజనాలు అనంతరం వివిధ ఆటల
పోటీలు జరిగాయి. కార్యక్రమంలో జేసీలు సునీల్‌కుమార్, కీర్తి చేకూరి,
భార్గవ్‌తేజ, డీఆర్వో సీహెచ్ సత్తిబాబు, సబ్ కలెక్టర్ ఇలాక్కియా, ఐటీడీఏ
పీవోలు ప్రవీణ్‌ఆదిత్య, రమణ, డీఈవో అబ్రహాం, కమిషనర్లు అభిషిక్త్‌కిషోర్,
స్వప్నిల్ దినకర్ పుం డ్కర్, ఆర్డీవోలు వెంకటరమణ. సింధు సుబ్రహ్మణ్యం,
వసంత రాయుడుతో పాటు పలు ప్రభుత్వ శాఖల జిల్లా స్థాయి అధికారులు, అటవీ
శాఖాధికారులు పాల్గొన్నారు. కార్య క్రమానికి కాకినాడకు చెందిన ఉపాధ్యాయుడు
ఎంకే మూర్తి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.