నిమటోడ్స్‌ ల్యాబ్‌తో రైతులకు ప్రయోజనం

ABN , First Publish Date - 2021-06-22T05:54:09+05:30 IST

కడియం సర్‌ ఆర్థర్‌ కాటన్‌ నర్సరీ అసోసియేషన్‌ భవనంలోని ఓ గదిలో వేరుకాయ నులుపురుగులు (నిమటోడ్స్‌) పరీక్ష చేసి నిర్ధారించే ల్యాబ్‌ను ఏర్పాటు చేసుకోవాలని తద్వారా రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని, నాణ్యమైన మొక్కల అభివృద్ధి చేసుకోవచ్చని ఉద్యానశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ ఎస్‌.రామ్మోహన్‌ పేర్కొన్నారు.

నిమటోడ్స్‌ ల్యాబ్‌తో రైతులకు ప్రయోజనం

  • ఉద్యానశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ రామ్మోహన్‌

కడియం, జూన్‌ 21: కడియం సర్‌ ఆర్థర్‌ కాటన్‌ నర్సరీ అసోసియేషన్‌ భవనంలోని ఓ గదిలో వేరుకాయ నులుపురుగులు (నిమటోడ్స్‌) పరీక్ష చేసి నిర్ధారించే ల్యాబ్‌ను ఏర్పాటు చేసుకోవాలని తద్వారా రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని, నాణ్యమైన మొక్కల అభివృద్ధి చేసుకోవచ్చని ఉద్యానశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ ఎస్‌.రామ్మోహన్‌ పేర్కొన్నారు. సాధారణ పర్యటనలో భాగంగా సోమవారం కడియం వచ్చిన ఆయన పూలమార్కెట్‌ను సందర్శించి పువ్వుల ఉత్పత్తి, ధరలను తెలుసుకున్నారు. డైరెక్టరేట్‌ ఆఫ్‌ ప్లోరికల్చర్‌ వేమగిరి వారి సహకారంతో పూనే కంపెనీల ద్వారా పూల నుంచి సెంటెడ్‌ ఆయిల్స్‌, రంగులు తీసే యంత్రం వంటి ప్రాజెక్టు వివరాలు తయారుచేసి వాటికి ప్రతిపాదనలు చేసుకోవాలని సూచించారు. అలానే మండలంలోని పాలీహౌసెస్‌ (రక్షితసాగు)లను సందర్శించి రానున్న కాలంలో మరిన్ని యూనిట్‌లు అవసరమని, వాటి కోసం సమగ్ర పరిజ్ఞానంతో నర్సరీ రంగాన్ని అభివృద్ధి చేయవచ్చని సూచించారు. కార్యక్రమంలో ఉద్యానశాఖ ఏడీ ఆర్‌.దేవానంద్‌, ఉద్యానశాఖ అధికారి డి.సుధీర్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-22T05:54:09+05:30 IST