భావితరాలకు మార్గదర్శకులుగా ఉండాలి
ABN , First Publish Date - 2021-10-30T05:06:56+05:30 IST
ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు భావి తరాలకు మార్గదర్శకులుగా ఉండాలని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉప కులపతి మొక్కా జగన్నాథరావు అన్నారు.
దివాన్‌చెరువు, అక్టోబరు 29: ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు భావి తరాలకు మార్గదర్శకులుగా ఉండాలని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉప కులపతి మొక్కా జగన్నాథరావు అన్నారు. వర్సిటీలో ఎల్‌ఐసీ విజిలెన్స్ అవగా హన వారోత్సవాలను శుక్రవారం వీసీ పరిశీలించారు. అవినీతిని అరికట్టడానికి కొత్తమార్గాలను రూపొందించడానికి యువతను ప్రోత్సహించాలన్నారు. ఎల్‌ఐసీ సేవలను అభినందించారు. ఇంకా పలువిషయాలు వివరించారు. నన్నయ వాణిజ్య శాస్త్ర సమన్వయకర్త ఎన్.ఉదయభాస్కర్ మాట్లాడుతూ విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వపోటీలు నిర్వహించామని తెలిపారు. విజేతలకు ఎల్‌ఐసీ బహుమతులు అందజేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో ఎల్‌ఐసీ సభ్యులు జీబీవీ రామయ్య, నాగేంద్రకుమార్, ఫణికుమార్, విద్యాసాగర్, బాలకృష్ణమూర్తి, శిరీష్‌కుమార్, నన్నయ అధ్యాపకులు కీర్తిమరిటా, అహ్మద్‌అలీ పాల్గొన్నారు.