నవోదయలో ఆరో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

ABN , First Publish Date - 2021-10-29T06:40:32+05:30 IST

పెద్దాపురంలోని జవహర్‌ నవోదయలో 2022-23 విద్యాసంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్‌ రామరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

నవోదయలో ఆరో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

పెద్దాపురం, అక్టోబరు 28: పెద్దాపురంలోని జవహర్‌ నవోదయలో 2022-23 విద్యాసంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్‌ రామరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను నవంబరు 30లోగా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ప్రభుత్వ పాఠశాలలో కానీ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో గానీ 3, 4, 5 తరగతులు చదివి ఉండాలన్నారు. 2021-22 విద్యాసంవత్సరంలో ఐదో తరగతి చదువుతూ ఉండాలన్నారు. పరీక్ష వచ్చేఏడాది ఏప్రిల్‌ 30న నిర్వహిస్తామన్నారు. వివరాలకు నవోదయ వెబ్‌సైట్‌ను సందర్శించాలని లేదా 9441829056, 9247469929 నెంబర్లలో సంప్రదించాలన్నారు.

Updated Date - 2021-10-29T06:40:32+05:30 IST