జాతీయ నాయకుల విగ్రహాలకు మాస్కులు

ABN , First Publish Date - 2021-05-02T07:04:51+05:30 IST

వెల్ల పంచాయతీలో కొవిడ్‌ నియంత్రణకు సర్పంచ్‌తో కూడిన కమిటీ ప్రతిజ్ఞ చేసింది.

జాతీయ నాయకుల విగ్రహాలకు మాస్కులు

ద్రాక్షారామ, మే 1: వెల్ల పంచాయతీలో కొవిడ్‌ నియంత్రణకు సర్పంచ్‌తో కూడిన కమిటీ ప్రతిజ్ఞ చేసింది. శనివారం గ్రామంలో జాతీయ నాయకుల విగ్రహాలకు మాస్కులు కట్టి అందరూ మాస్కులు ధరించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సూరిబాబు,  కార్యదర్శి ఎస్‌ఎన్‌వి భీమేశ్వరి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. హసన్‌బాద గ్రామాన్ని కరోనా రహిత గ్రామంగా తీర్చిదిద్దుతామని శనివారం సర్పంచ్‌ నాగిరెడ్డి సతీష్‌రావు, కరోనా కట్టడి కమిటీ సభ్యులు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఏఎన్‌ఎం, ఆశావర్కర్లు, వలంటీర్లు, కార్యదర్శి, వీఆర్‌వో  సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. 


Updated Date - 2021-05-02T07:04:51+05:30 IST