జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీల్లో బంగారు పతకాలు
ABN , First Publish Date - 2021-02-01T06:28:22+05:30 IST
జాతీయ స్థాయిలో జరిగిన బాక్సింగ్ పోటీల్లో ఇద్దరు క్రీడాకారులు బంగారు పతకాలు సాధించా రని బాక్సింగ్ కోచ్ బి.మధుకుమార్ తెలిపారు.

మామిడికుదరు, జనవరి 31: జాతీయ స్థాయిలో జరిగిన బాక్సింగ్ పోటీల్లో ఇద్దరు క్రీడాకారులు బంగారు పతకాలు సాధించా రని బాక్సింగ్ కోచ్ బి.మధుకుమార్ తెలిపారు. గోవాలో ఈనెల 29నుంచి 31వరకు యూత్ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ అసోసియే షన్ ఆధ్వర్యంలో జరిగిన మూడో నేషనల్ ఫెడరేషన్ కప్ బాక్సింగ్ పోటీల్లో అప్పన పల్లికి చెందిన బొంతు గీతికావేణి, మామిడి కుదురుకు చెందిన బోయి అర్జున్‌లు బంగారు పతకాలు సాధించి అంతర్జాతీయ బాక్సింగ్ పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు. వారు మామిడికుదురులోని నవ యువ క్రీడా యువజన సేవా సంఘంలో శిక్షణ తీసుకుంటున్నారని, త్వర లో నేపాల్‌లో జరిగే అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంటారని కోచ్ తెలిపారు.