ముప్పన సేవలు మరువలేనివి

ABN , First Publish Date - 2021-08-22T05:29:51+05:30 IST

పెద్దాపురం, ఆగస్టు 21: పెద్దాపురం మున్సిపల్‌ చైర్మన్‌గా సుదీర్ఘ కాలం పనిచేసిన ముప్పన రామారావు సేవలు మరువలేనివని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభా్‌షచంద్రబోస్‌ అన్నారు. మున్సిపల్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ముప్పన రామారావు కాంస్య విగ్రహాన్ని మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, కురసాల కన్నబాబుతో కలిసి ఆయన శనివారం ఆవిష్కరించి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం రాష్ట్ర

ముప్పన సేవలు మరువలేనివి
రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎంపీ బోస్‌

రామారావు విగ్రహావిష్కరణ సభలో రాజ్యసభ సభ్యుడు సుభా్‌ష చంద్రబోస్‌ 

హాజరైన మంత్రులు వేణు, కన్నబాబు

పెద్దాపురం, ఆగస్టు 21: పెద్దాపురం మున్సిపల్‌ చైర్మన్‌గా సుదీర్ఘ కాలం పనిచేసిన ముప్పన రామారావు సేవలు మరువలేనివని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభా్‌షచంద్రబోస్‌ అన్నారు. మున్సిపల్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ముప్పన రామారావు కాంస్య విగ్రహాన్ని మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, కురసాల కన్నబాబుతో కలిసి ఆయన శనివారం ఆవిష్కరించి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌  చైర్మన్‌ దవులూరి దొరబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో బోస్‌ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్ర చేనేత ఆప్కో డైరెక్టర్‌గా రామారావు సేవలను అందించారని, రాజమహేంద్రవరం స్పిన్నింగ్‌ మిల్స్‌ అధ్యక్షుడిగా పనిచేశారని, ఇంకా ఎన్నో పదవులను అధిరోహించి పెద్దాపురానికి మంచి పేరు ప్రఖ్యాతలను తీసుకువచ్చారన్నారు. మంత్రులు వేణు, కన్నబాబు, కాకినాడ  ఎంపీ వంగా గీతావిశ్వనాథ్‌ మాట్లాడుతూ చేనేత రంగానికి ఆయన చేసిన సేవలను మరువలేనివని, ఆయన విద్య రంగాభివృద్ధికి ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. పట్ణణంలో వీర్రాజు స్కూలు నిర్మాణానికి కృషి చేసి నిరుపేదల విద్యాభివృద్దికి ఎంతో కృషి చేశారన్నారు. హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దవులూరి దొరబాబు, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాతో పలువురు మాట్లాడుతూ సుదీర్ఘ కాలంపాటు పెద్దాపురం మున్సిపల్‌ చైర్మన్‌గా ఆయన వ్యవహరించడం గొప్పవిషమన్నారు. అలాగే గోదావరి జలాలను పట్టణానికి తీసుకువచ్చి ప్రజల దాహార్తిని తీర్చారన్నారు. ఆయనకు గుర్తుగా పట్టణంలో విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో దేవాంగ కార్పొరేషన్‌ చైర్మన్‌ బీరక సురేంద్ర, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బొడ్డు తులసీ మంగతాయారు, వైస్‌ చైర్మన్‌ నెక్కంటి సాయిప్రసాద్‌, కనకాల మహాలక్ష్మీ, ముప్పన శ్యామలాంబ, వీర్రాజు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-22T05:29:51+05:30 IST