మున్సిపాల్టీలో ఇంటింటికి కుళాయి: వేణు

ABN , First Publish Date - 2021-12-28T06:07:58+05:30 IST

రామచంద్రపురం మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం చైర్మన్‌ గాధంశెట్టి శ్రీదేవి అధ్యక్షతన మున్సిపల్‌ కౌన్సిల్‌ హాల్‌లో సోమ వారం నిర్వహించారు.

మున్సిపాల్టీలో ఇంటింటికి కుళాయి: వేణు

రామచంద్రపురం, డిసెంబరు 27: రామచంద్రపురం మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం చైర్మన్‌ గాధంశెట్టి శ్రీదేవి అధ్యక్షతన మున్సిపల్‌ కౌన్సిల్‌ హాల్‌లో సోమ వారం నిర్వహించారు. ఎక్స్‌అఫిషియో మెంబర్‌గా పాల్గొన్న మంత్రి వేణు మాట్లాడుతూ మున్సిపల్‌ పరిధిలోని 28వార్డుల్లో తాగునీటికి ఇబ్బంది లేకుండా ఇంటింటికీ కుళాయిలను అందించేలా మున్సి పల్‌ అధి కారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావే శంలో అధికారులు ప్రతిపాదించిన ఐదు అంశాలను కౌన్సిల్‌ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈసంద ర్భంగా మంత్రి వేణు మాట్లాడుతూ తెల్లరేషన్‌ కార్డు కలిగిన పేదలకు రూ.250కు తాగునీటి కనెక్షన్‌ ఇవ్వా లని, వాటిని మున్సిపల్‌ అధికారులు తక్షణం అమలు చేయాలని ఆదేశించారు. మున్సిపల్‌ కాంట్రా క్టర్లు పూర్తిచేసిన పనుల నిమిత్తం చెల్లించాల్సిన ధరా వత్తు సొమ్ముకు సంబంధించిన అంశాన్ని కౌన్సిల్‌ రద్దు చేసింది. సమావేశంలో వైస్‌ చైర్మన్‌లు చింతపల్లి నాగే శ్వరరావు, కె.శివాజీ, చీఫ్‌ విప్‌ వాడ్రేవు సాయిప్ర సాద్‌, మున్సిపల్‌ కమిషనర్‌ కె.శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు. 



Updated Date - 2021-12-28T06:07:58+05:30 IST