27న ఎమ్మార్పీఎస్ సభ
ABN , First Publish Date - 2021-01-20T06:51:53+05:30 IST
కిర్లంపూడి, జనవరి 19: రాజానగరం మండలం దోసకాయపల్లిలో ఈనెల 27న జరిగే ఎమ్మార్పీఎస్ సభను మాదిగలు విజయవంతం చేయాలని ఎ

కిర్లంపూడి, జనవరి 19: రాజానగరం మండలం దోసకాయపల్లిలో ఈనెల 27న జరిగే ఎమ్మార్పీఎస్ సభను మాదిగలు విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్‌చార్జ్ ఎం.చినసుబ్బారావు పిలుపునిచ్చారు. కిర్లంపూడిలో డివిజన్ కార్యకర్తల సమావేశం మండల మాజీ అధ్యక్షుడు గండేటి డేవిడ్‌రాజు మాదిగ అధ్యక్షతన నిర్వహించగా సుబ్బారావు మాట్లాడారు. ఈ సభకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హాజరవుతున్నారని తెలిపారు. జిల్లా మాజీ అధికార ప్రతినిధి మం దేటి డేవిడ్‌రాజు, ఎమ్‌ఎ్‌సఎఫ్ సభ్యులు కాకాడ నూకరాజు దూళపల్లి వెంకటరమణ, జిల్లా మహిళా నాయకురాలు ఇంధన చిన్నారి పాల్గొన్నారు.