అంతర్వేది పరిసరాల్లో షూటింగ్‌

ABN , First Publish Date - 2021-10-29T05:21:16+05:30 IST

కోనసీమ అందాలు మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తాయని హీరో శర్వానంద్‌ అన్నారు. కోనసీమ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న షూటింగ్‌లో పాల్గొనడం ఆనందంగా ఉందని హీరోయిన్‌ రష్మిక చెప్పారు.

అంతర్వేది పరిసరాల్లో షూటింగ్‌

అంతర్వేది, అక్టోబరు 28: కోనసీమ అందాలు మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తాయని హీరో శర్వానంద్‌ అన్నారు. కోనసీమ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న షూటింగ్‌లో పాల్గొనడం ఆనందంగా ఉందని హీరోయిన్‌ రష్మిక చెప్పారు. అంతర్వేది ఆలయ పరిసర ప్రాంతాల్లో ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమా షూటింగ్‌లో వారు పాల్గొన్నారు. అంతర్వేది బీచ్‌లో సందడి చేశారు.  ఈ చిత్రానికి తిరుమల కిషోర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అంతర్వేది బీచ్‌లో హీరో శర్వానంద్‌, హీరోయిన్‌ రష్మికలను చూసేందుకు అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. హీరో, హీరోయిన్లతో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. శర్వానంద్‌ అభిమానులను ఆప్యాయంగా పలకరించారు. 

Updated Date - 2021-10-29T05:21:16+05:30 IST