గొల్లప్రోలులో మోటార్‌సైకిళ్ల చోరీలు
ABN , First Publish Date - 2021-10-29T06:59:47+05:30 IST
గొల్లప్రోలు పట్టణంలో వరుసగా జరుగుతున్న మోటార్‌సైకిళ్ల చోరీలు కలకలం సృష్టిస్తున్నాయి. పట్టణంలోని రైల్వేస్టేషన్ సమీపంలో వేర్వేరు చోట్ల మూడు బైకులు చోరీకి గురయ్యాయి. మరో మూడు మోటార్‌సైకిళ్లలో పెట్రోల్‌ను చోరీ చేశారు.
గొల్లప్రోలు, అక్టోబరు 28: గొల్లప్రోలు పట్టణంలో వరుసగా జరుగుతున్న మోటార్‌సైకిళ్ల చోరీలు కలకలం సృష్టిస్తున్నాయి. పట్టణంలోని రైల్వేస్టేషన్ సమీపంలో వేర్వేరు చోట్ల మూడు బైకులు చోరీకి గురయ్యాయి. మరో మూడు మోటార్‌సైకిళ్లలో పెట్రోల్‌ను చోరీ చేశారు. మరో బైక్‌ను దొంగలించి అందులో పెట్రోల్ తీసివేసి కొంచెం దూరంలో వదిలివేశారు. ఒకేసారి ఇటువంటి సంఘటనలు జరగడంతో ఇవి పెట్రోల్ కోసం చేశారా లేక బైక్ దొంగతనాలకు పాల్పడేవారు చేశారా అన్నది తెలియాల్సి ఉంది.