థెరిస్సా సేవలను అందరూ అనుసరించాలి

ABN , First Publish Date - 2021-08-27T06:05:58+05:30 IST

మదర్‌థెరిస్సా సేవలను అందరూ అనుసరించాలని వ్యవసాయశాఖా మంత్రి కురసాల కన్నబాబు అన్నారు.

థెరిస్సా సేవలను అందరూ అనుసరించాలి

 వ్యవసాయ శాఖా మంత్రి కన్నబాబు 

కాకినాడ రూరల్‌, ఆగస్టు 26: మదర్‌థెరిస్సా సేవలను అందరూ అనుసరించాలని వ్యవసాయశాఖా మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. కాకినాడ రూరల్‌ మండలం తూరంగి రవీంద్రనగర్‌లోని గాయత్రీ కళ్యాణ మండపంలో పీస్‌సేవా సంఘం వ్యవస్థాపకులు మండవ దైవసమాధానం ఆధ్వర్యంలో మధర్‌థెరిస్సా జయంతిని పురస్కరించుకుని ఆమె చిత్రపటానికి మంత్రి కన్నబాబు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం 250మంది వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు దుస్తులు, చీరలు పంపిణీ చేశారు. కన్నబాబు మాట్లాడుతూ మధర్‌థెరిస్సా సేవలను స్ఫూర్తిగా తీసుకుని మరింతమందికి సేవలు చేస్తున్న సమాధానాన్ని అభినందించారు. గ్రామంలో మధర్‌థెరిస్సా విగ్రహాన్ని నెలకొల్పాలని కోరారు. మాజీసర్పంచ్‌ బలగం ప్రసన్నకుమార్‌, జ్ఞానసుధీర్‌, అనిశెట్టి రామకృష్ణ, పంచాయతీ కార్యదర్శి జొన్నాడ నరసింహారావు పాల్గొన్నారు.

ఆదిత్యా విద్యాసంస్థ ప్రాంగణంలో..

గండేపల్లి: ఆదిత్యా విద్యాసంస్థ ప్రాంగణంలో మదర్‌థెరిస్సా జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. మదర్‌ థెరిస్సా చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో విద్యా సంస్థల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

ఏలేశ్వరం: మదర్‌ ఽథెరిస్సా జయంతి సందర్భంగా గురువారం ఏలేశ్వరంలో లయన్స్‌క్లబ్‌ ఆఫ్‌ ఏలేశ్వరం బనానాల్యాండు, హెల్ఫింగ్‌ యూత్‌ ఆసోసియేషన్‌ల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపట్టారు. అలమండ దుర్గావెంకటప్రసాద్‌, జ్యోతుల శ్రీనివాస్‌, పూర శ్రీను, డాక్టర్‌ అనసూరి నాగేశ్వరరావు, కందుల ప్రభాకరరావు, పూర రాజబాబు, అప్పన్నబాబు, ఉడతల రమణారావు తదితర లయన్స్‌క్లబ్‌ ప్రతినిధులు సహకారబ్యాంక్‌, ప్రభుత్వాసుపత్రి ఆవరణల్లో గల మదర్‌ థెరిస్సా విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆసుపత్రుల్లోని రోగులకు పాలు, పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. అలాగే వెదుళ్ల అప్పాజీ, పర్వత శివ, రాంలాల్‌, అంజూరి రాంబాబు, కేళం దుర్గా, బండి కోటి, ఎస్‌కె.ఆలీషా, మద్దుల స్వరూప్‌ తదితర హెల్పింగ్‌ యూత్‌ ప్రతినిధులు ఎంఈవో కార్యాలయం వద్ద గల మదర్‌ థెరిస్సా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం భవిత సెంటర్‌లో ఆశ్రయం పొందుతున్న మానసిక దివ్యాంగ చిన్నారులకు పలకలు, బిస్కెట్‌ ప్యాకెట్లు, పండ్లరసాలు పంపిణీ చేశారు. 



Updated Date - 2021-08-27T06:05:58+05:30 IST