కంటేనే అమ్మ అని అంటే ఎలా?

ABN , First Publish Date - 2021-11-02T05:47:31+05:30 IST

కంటేనే అమ్మ అని అంటే ఎలా? అని ఓ సినిమా పాటలో చెప్పినట్లు..తనను కనకపోయిన పెంచిన రుణాన్ని తల కొరివి పెట్టి తీర్చుకుంది ఓ మహిళ..

కంటేనే అమ్మ అని అంటే ఎలా?
పెంచిన తల్లికి తలకొరివి పెడుతున్న కూతురు

   రౌతులపూడి, నవంబరు 1: కంటేనే అమ్మ అని అంటే ఎలా? అని ఓ సినిమా పాటలో చెప్పినట్లు..తనను కనకపోయిన పెంచిన రుణాన్ని తల కొరివి పెట్టి తీర్చుకుంది ఓ మహిళ..  తల్లి తర్వాత తల్లిలాంటి పినతల్లి అంతిమ సంస్కారాలు దగ్గరుండి నిర్వహించి శభాష్‌ అనిపించుకుంది. రౌతులపూడికి చెందిన అల్లు దేవుడమ్మ సోమవారం అనారోగ్యంతో మృతిచెందింది. ఆమెకు పిల్లలు లేరు. భర్త దేవుడు మొదటి భార్య పిల్లలు వీరబాబు, జయమ్మలనే పిల్లలుగా భావించి పెంచుకుంది. అయితే  వీరబాబు పట్టించుకోకపోవడంతో జయమ్మ దేవుడమ్మకు తలకొరివి పెట్టింది. ఆమెకు టీడీపీ నాయకుడు అల్లు బుజ్జి, కొమ్ముల శ్రీను, కొమ్ముల నూకరాజు, అల్లు తాతాజీ, అల్లు శ్రీను అండగా నిలిచారు.

Updated Date - 2021-11-02T05:47:31+05:30 IST