మోటార్‌సైకిల్ ఢీకొని వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2021-10-25T05:51:37+05:30 IST
పామర్రు టేకిడ్రైన్ సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు.

కె.గంగవరం, అక్టోబరు 24: పామర్రు టేకిడ్రైన్ సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పామర్రు గ్రామానికి చెందిన ఇసుకపట్ల దుర్గారావు(50) పొలం వెళ్లి పచ్చగడ్డి కోసుకుని సైకిల్‌పై ఇంటికి వస్తున్నాడు. ఈ సమయంలో పామర్రు వైపు నుంచి ద్విచక్రవాహనంపై కురకాళ్లపల్లి వైపు వెళుతున్న మోటార్‌సైకిలిస్టు అతడ్ని ఢీకొట్టాడు. ఈప్రమాదంలో సైకిలిస్టు దుర్గారావు అక్కడికక్కడే మృతి చెందాడు. మోటార్‌సైకిలిస్టుకు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం కాకినాడ ఆస్పత్రికి తరలించారు. పామర్రు స్టేషన్ హౌస్ ఆఫీసర్ రామకృష్ణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.