మోటారుసైకిల్‌ దొంగ అరెస్టు

ABN , First Publish Date - 2021-02-06T07:03:05+05:30 IST

మందపల్లి బ్రిడ్జి సమీపంలో దొంగిలించిన మోటారుసైకిళ్లను అమ్మడానికి ప్రయత్నిస్తున్న మందపల్లికి చెందిన యేసుకొన రామకృష్ణను ఎస్‌ఐ ఎల్‌.శ్రీనునాయక్‌ ఆధ్వర్యంలో సిబ్బంది అరెస్టు చేశారు.

మోటారుసైకిల్‌ దొంగ అరెస్టు

12 మోటారుసైకిళ్లు స్వాధీనం

కొత్తపేట, ఫిబ్రవరి 5: మందపల్లి బ్రిడ్జి సమీపంలో దొంగిలించిన మోటారుసైకిళ్లను అమ్మడానికి ప్రయత్నిస్తున్న మందపల్లికి చెందిన యేసుకొన రామకృష్ణను ఎస్‌ఐ ఎల్‌.శ్రీనునాయక్‌ ఆధ్వర్యంలో సిబ్బంది అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి 12బైక్‌లను స్వాఽధీనం చేసుకున్నట్టు ఎస్‌ఐ  తెలిపారు. తొమ్మిదో తరగతి చదివిన అతడు తాపీ పనిచేసేవాడని, చెడు వ్యసనాలకు బానిసై డబ్బు సులువుగా సంపాదించాలని ఉభయ గోదావరి జిల్లాల్లో 12మోటారుసైకిళ్లను దొంగిలించడాని ఎస్‌ఐ చెప్పారు. కార్యక్రమంలో అడిషినల్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ కేవీఎస్‌ సత్యనారాయణ, ఏఎస్‌ఐ కె.శ్రీనివాసరావు, హెచ్‌సీలు సీహెచ్‌ సత్తిబాబు, జేజీఎస్‌వీ ప్రసాద్‌, సిబ్బంది జి.కృష్ణసాయి, ఇ.వెంకటేష్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-02-06T07:03:05+05:30 IST