నిండుశోకంతో మొహర్రం

ABN , First Publish Date - 2021-08-21T06:10:16+05:30 IST

ఇమాం హుస్సేన్‌, అతని 72మంది పరివారం అమరత్వం పొందిన రోజైన మొహర్రాన్ని ముస్లింలు శుక్రవారం నిండుశోకంతో జరుపుకున్నారు. బ్లేడులు, కత్తులు, గొలుసులతో తమ శరీరాలను గాయపరుచుకుని హుస్సేన్‌ హుస్సేన్‌ అని నినదిస్తూ రక్తతర్పణం అర్పించారు.

నిండుశోకంతో మొహర్రం
మొహర్రం సందర్భంగా మాతం నిర్వహిస్తున్న ముస్లింలు

మామిడికుదురు, ఆగస్టు 20: ఇమాం హుస్సేన్‌, అతని 72మంది పరివారం అమరత్వం పొందిన రోజైన మొహర్రాన్ని ముస్లింలు శుక్రవారం నిండుశోకంతో జరుపుకున్నారు. బ్లేడులు, కత్తులు, గొలుసులతో తమ శరీరాలను గాయపరుచుకుని హుస్సేన్‌ హుస్సేన్‌ అని నినదిస్తూ రక్తతర్పణం అర్పించారు. మామిడికుదురు, నగరం గ్రామాల్లోని 37 పంజాల నుంచి తీసిన పీర్లు, గుమ్మటాలను పురవీధుల్లో ఊరేగించారు. కర్బలా పుణ్యభూమిలో జరిగిన యుద్ధ ఘట నలను మత ప్రబోధకుడు షబ్బర్‌అలీజైదీ వివరించారు. షియా మసీదులో అమరవీరు ల పేరిట మతగురువు ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. నగరంలోని హజరత్‌ ఇమాం హుస్సేన్‌ పంజా వద్ద ప్రారంభమైన ఊరేగింపు పెదపంజీషా వరకు జరిగింది. మంజిలేకర్బలావద్ద రక్తం చిందిస్తూ మాతం నిర్వహించారు. సయ్యద్‌ మహ్మద్‌అలీజాఫరీ పెదపంజీషాలో సహదత్‌ మజ్లిస్‌ నిర్వహిం చారు. నగరంలోని పీర్ల చెరువులో పీర్లను శాంతింపజేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాం తాలనుంచి వచ్చిన భక్తులు నల్లటి దుస్తులు ధరించి మొహర్రం సంతాప దినాల్లో పాల్గొ న్నారు. పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పీర్లకు మొక్కుబడి చెల్లించుకున్నారు.

ద్రాక్షారామలో..

ద్రాక్షారామ: మొహర్రాన్ని స్థానిక ముస్లింలు నిండు శోకంతో జరుపుకున్నారు. రంగుల వస్త్రాలతో పీరులను అలంకరించి ఊరేగించారు. ఉదయం ప్రత్యేక నమాజు చేశారు. ఆగావారి పంజా ఆవరణలో మాతం నిర్వహించారు. మొక్కుబడులు సమర్పించుకున్నారు. పంజా ముజావర్లు, అంజుమన్‌ సంఘాలు భోజన వసతి కల్పించారు. ఇరాన్‌లో పట్టభద్రుడైన మీర్జా అస్కరీ హుస్సేన్‌ మజ్లిస్‌ బోధించారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఇమాన్‌ హుస్సేన్‌ భక్తి సంఘాలు అంజుమనే హుస్సేనీ, అంజుమనే పరమాన్నే ఎ అబ్బాస్‌, పంజతని, మాతందారనే హుస్సేనీ, అంజుమనే అలీ అక్బర్‌, అంజుమనే అలీ అస్గర్‌ తదితర స్వచ్ఛంద సంస్థలు సేవలు అందించాయి.

Updated Date - 2021-08-21T06:10:16+05:30 IST