విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం
ABN , First Publish Date - 2021-02-26T05:30:00+05:30 IST
కోటనందూరు, ఫిబ్రవరి 26: విద్యా వ్యవస్థను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని పీడీఎఫ్ బలపరిచిన ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి షేక్ సాబ్జి విమర్శించారు. శుక్రవారం మండలంలోని కోటనందూరు, అల్లిపూడి, భీమవరపుకోట, చిన్నాయిపాలెం, పాత కోఠం హైస్కుల్లో ఆయన ఉపాధ్యాయుల

ఎమ్మెల్సీ అభ్యర్థి షేక్ సాబ్జి
కోటనందూరు, ఫిబ్రవరి 26: విద్యా వ్యవస్థను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని పీడీఎఫ్ బలపరిచిన ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి షేక్ సాబ్జి విమర్శించారు. శుక్రవారం మండలంలోని కోటనందూరు, అల్లిపూడి, భీమవరపుకోట, చిన్నాయిపాలెం, పాత కోఠం హైస్కుల్లో ఆయన ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సాబ్జి మాట్లాడుతూ రాష్ట్రంలో 27 వేలు పోస్టులు భర్తీ చేయలేదన్నారు. నాడు-నేడు పేరుతో హంగామా తప్ప విద్యార్థులకు ఉపయోగం లేదని విమర్శించారు. ప్రభుత్వ కార్యక్రమాలు ఉపాధ్యాయులతో నిర్వహించడంపై మండిపడ్డారు. పోరాటాల ఫలితంగానే ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారమవుతున్నాయని ఆయన చెప్పారు. కార్యక్రమాల్లో గుడివాడ అప్పలనాయుడు, మాకిరెడ్డి యర్రాపాత్రుడు, సత్యనారాయణ, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.