బ్యాంకులతో ఎంతో మందికి బంగారు భవిష్యత్తు

ABN , First Publish Date - 2021-10-22T05:08:14+05:30 IST

గ్రామీణ మహిళలు, యువతకు పరిశ్రమల ఏర్పాటుకు రుణాలు అందిస్తున్న బ్యాంకులు మట్టిలో మాణి క్యాలను వెలికి తీస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు.

బ్యాంకులతో ఎంతో మందికి బంగారు భవిష్యత్తు

భానుగుడి (కాకినాడ), అక్టోబరు 21: గ్రామీణ మహిళలు, యువతకు పరిశ్రమల ఏర్పాటుకు రుణాలు అందిస్తున్న బ్యాంకులు మట్టిలో మాణి క్యాలను వెలికి తీస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా గురువారం రుణ వితరణ మహోత్సవాన్ని నిర్వహించారు. కురసాల కన్నబాబు, కాకినాడ ఎంపీ వంగా గీత, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, జిలా కలెక్టర్‌ సి.హరికిరణ్‌ తదితరులు కార్యక్రమాన్ని ప్రారంభించారు. వివిధ కార్యక్రమాల ద్వారా రుణాలు పొందిన లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు, ఎంపీ వంగా గీత, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ మాట్లాడుతూ రుణ వితరణ మహోత్సవంలో భాగంగా ఇప్పటివరకు 16,892 మంది లబ్ధిదారులకు రూ.425 కోట్లు అందిం చారన్నారు. జిల్లా కలెక్టర్‌ హరికిరణ్‌ మాట్లాడుతూ ప్రతి కుటుంబం వ్యాపారం, వాణిజ్య సంస్థ అభివృద్ధికి బ్యాంకులు వెన్నుదన్నుగా నిలు స్తున్నాయని చెప్పారు.  రుణ మహోత్సవంలో భాగంగా బ్యాంకులు మొత్తం 32 స్టాళ్లను ఏర్పాటు చేశాయి. సిడ్బీ, జిల్లా పరిశ్రమల కేంద్రం, నాబార్డ్‌, ఎస్‌బీఐ, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కెనరా బ్యాంక్‌ , జిల్లా సహకార కేంద్ర బ్యాంక్‌ ఏర్పాటు చేసిన స్టాళ్లు కార్యక్రమానికి వచ్చిన వారిని ఆకటు ్టకున్నాయి. కార్యక్రమంలో బ్యాంక్‌ అధికారులు రుణం మంజూరు వివరాలను, ఈ స్టాళ్లు ద్వారా వివరి ంచగా, పరిశ్రమల ఏర్పాటుకు సలహాలు, సూచనలు అందించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ముఖ్యమైన పరిశ్రమల ప్రోత్సాహక పథకాలపై అవగాహన కల్పించారు.

Updated Date - 2021-10-22T05:08:14+05:30 IST