మైనింగ్ అక్రమాల పరిశీలన
ABN , First Publish Date - 2021-08-03T05:51:02+05:30 IST
రాష్ట్రంలో మైనింగ్ మాఫి యా నడుస్తోంది. సీఎం జగన్ నాయకత్వంలో బాక్సైట్, గ్రానైట్, గ్రావెల్, ఇసుక, చివరకు మట్టి మాఫియా కూడా నడుస్తోంది.

రాజమహేంద్రవరం, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మైనింగ్ మాఫి యా నడుస్తోంది. సీఎం జగన్ నాయకత్వంలో బాక్సైట్, గ్రానైట్, గ్రావెల్, ఇసుక, చివరకు మట్టి మాఫియా కూడా నడుస్తోంది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆదేశాల మేరకు తాము ఒక కమిటీగా ఏర్పడి రాష్ట్రంలో జరుగుతున్న మైనింగ్ అక్రమాలను పరిశీలించామని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటివరకూ తాము తనిఖీ చేసిన చోట గుర్తించి అక్రమాల గురించి గ్రీన్ ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేయగా, స్పం దించి ఒక కమిటీని నియమించిందని, త్వరలో ఈ కమిటీ విచారణ చేయనున్నదని ఆయన తెలిపారు. కొండపల్లి గనుల అక్రమాల పరిశీలనకు వెళ్లిన మాజీ మంత్రి దేవినేని ఉమను అరెస్ట్ చేసి జైలులో పెట్టారన్నారు. తమను అడ్డుకోబోతు ఆర్టీసీ బస్సులో వెళ్లామని తెలిపారు. అసలు మైనింగ్ అక్రమా లు లేకపోతే తమను పరిశీలించుకోనివ్వవచ్చు కదా, అధికారులను పంపి వివరించమని చెప్పవచ్చు కదా, టీడీపీ అంటే భయమెందుకని ఆయన ప్రశ్నించారు. సమావేశంలో పార్టీనేతలు వెంకట్రామారెడ్డి, ఆదినారాయణరెడ్డి, అక్కిరెడ్డి, సుబ్బారెడ్డి, చిట్టిబాబు,, తాతారెడ్డి, సర్వారాయుడు పాల్గొన్నారు.