ఔషధ మొక్కలను సంరక్షించుకోవాలి

ABN , First Publish Date - 2021-12-31T06:06:04+05:30 IST

ఔషధ మొక్కలను సంరక్షించి భావితరాలకు అందించవలసిన బాధ్యత అందరిపై ఉందని ఎంపీడీవో రత్నకుమారి అన్నారు.

ఔషధ మొక్కలను సంరక్షించుకోవాలి

దేవీపట్నం, డిసెంబరు 30: ఔషధ మొక్కలను సంరక్షించి భావితరాలకు అందించవలసిన బాధ్యత అందరిపై ఉందని ఎంపీడీవో రత్నకుమారి అన్నారు. ఔషధ మొక్కలతో చాలా ప్రయోజనాలున్నాయన్నారు. గురువారం ఏపీ బయోడైవర్సిటీ ఆధ్వర్యంలో సెంట్రల్‌ మెడికల్‌ ప్లాంట్‌ సహకారంతో ప్రకృతి స్వచ్ఛంద సేవా సంస్థ వారు మండలంలో సుమారు 100మంది రైతులకు ఇందుకూరుపేట సర్పంచ్‌ కారం కృష్ణదొర, ఇందుకూరు సర్పంచ్‌ కోసు లక్ష్మణదొర ఇందుకూరుపేట గ్రామ సచివాలయంలో 17 రకాల ఔషధ మొక్కలను అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ ఈ అవకాశాన్ని ప్రతీ లబ్ధిదారుడు ఉపయోగించుకోవాలన్నారు. ప్రకృతి స్వచ్ఛంద సేవా సంస్థ కార్యదర్శి సుబ్బరాజు మాట్లాడుతూ పెరట్లో ఔషధ మొక్కలు ఉంచుకుంటే మనకు ఎంతో ఉపయోగపడతాయన్నారు. కార్యర్రమంలో గ్రామ సచివాలయ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-31T06:06:04+05:30 IST