వైద్యవిధాన పరిషత్ ఆసుపత్రుల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
ABN , First Publish Date - 2021-11-22T05:13:44+05:30 IST
జిల్లాలోని ఏపీ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 82 ఉద్యోగాలను కాంట్రాక్టు, పొరుగుసేవల పద్ధతిలో భర్తీ చేయడానికి దరఖాస్తులు కోరుతున్నట్టు జిల్లా వైద్యసేవల సమన్వయాధికారి డాక్టర్ టి.రమేష్‌కిశోర్ ఓ ప్రకటనలో తెలిపారు.

రాజమహేంద్రవరం
అర్బన్, నవంబరు 21: జిల్లాలోని ఏపీ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో
వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 82 ఉద్యోగాలను కాంట్రాక్టు, పొరుగుసేవల
పద్ధతిలో భర్తీ చేయడానికి దరఖాస్తులు కోరుతున్నట్టు జిల్లా వైద్యసేవల
సమన్వయాధికారి డాక్టర్ టి.రమేష్‌కిశోర్ ఓ ప్రకటనలో తెలిపారు. ల్యాబ్
టెక్నీషియన్లు-27, ఫార్మసిస్టులు-14 కాంట్రాక్టు విధానంలోను,
రేడియోగ్రాఫర్-4, జూనియర్ అసిస్టెంట్-16, ఆడియోమెట్రిషన్-1, మెడికో
సోషల్ వర్కర్-1, ల్యాబ్ అటెండర్-1, ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్-2,
థియేటర్ అసిస్టెంట్-7, ఆఫీస్ సబార్డినేట్-7, ఎలక్ర్టీషియన్-1,
పోస్టుమార్టం అసిస్టెంట్-1 పోస్టులను పొరుగుసేవల పద్ధతిలోను జిల్లా
సెలక్షన్ కమిటీ ద్వారా భర్తీ చేయనున్నట్టు తెలిపారు. ఆసక్తి ఉన్న
అభ్యర్థులు ఈనెల 29వ తేదీలోగా రాజమహేంద్రవరంలోని జిల్లా వైద్యసేవల
సమన్వయాధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.