దేహదారుఢ్యంతోపాటు ఆరోగ్యంగా ఉండాలి: ఎస్పీ

ABN , First Publish Date - 2021-10-29T07:05:13+05:30 IST

దేహదారుఢ్యంతోపాటు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మరింత సమర్ధవంతంగా విధులు నిర్వహించాలని ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు సూచించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని కాకినాడ రిజర్వు పోలీస్‌లైన్‌లోని పోలీసు కన్వెన్షన్‌ హాల్లో ట్రస్ట్‌ హాస్పటల్స్‌, దుర్గా సోము ప్రసాద్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ సహకారంతో నిర్వహించిన మెగా వైద్యశిబిరాన్ని ఆయన ప్రారంభించారు.

దేహదారుఢ్యంతోపాటు ఆరోగ్యంగా ఉండాలి: ఎస్పీ

కాకినాడ క్రైం, అక్టోబరు 28: దేహదారుఢ్యంతోపాటు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మరింత సమర్ధవంతంగా విధులు నిర్వహించాలని ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు సూచించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని కాకినాడ రిజర్వు పోలీస్‌లైన్‌లోని పోలీసు కన్వెన్షన్‌ హాల్లో ట్రస్ట్‌ హాస్పటల్స్‌, దుర్గా సోము ప్రసాద్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ సహకారంతో నిర్వహించిన మెగా వైద్యశిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధినిర్వహణలో ఒత్తిళ్లతో ఆరోగ్య రుగ్మతల బారిన పడుతున్న సిబ్బంది ఆరోగ్య సంరక్షణ కోసం మెగా క్యాంప్‌ నిర్వహించామన్నారు. ట్రస్ట్‌ ఆసుపత్రి, సోము దుర్గాప్రసాద్‌ ట్రస్ట్‌ నిర్వాహకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ట్రస్ట్‌ ఆసుపత్రి డైరెక్టర్‌ డాక్టర్‌ రామకృష్ణ ఆధ్వర్యంలో వైద్యపరీక్షలు నిర్వహించారు. సోముదుర్గాప్రసాద్‌ ట్రస్ట్‌ సమకూర్చిన మందుల ను పంపిణీ చేశారు. అడిషనల్‌ ఎస్పీ కె.కుమార్‌, ఎస్‌బీ డీఎస్పీ అంబికాప్రసాద్‌, ఎస్‌డీపీవో భీమారావు, ఏఆర్‌ డీఎస్పీ వెంకటఅప్పారావు, డీఎస్పీలు పడాల మురళీకృష్ణారెడ్డి, సుంకర మురళీమోహన్‌, ఎస్‌.రాంబాబు, ఐటీ కోర్‌ ఇన్‌స్పెక్టర్‌ పి.రామచంద్రరావు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-29T07:05:13+05:30 IST