ప్రమాదానికి గురైన పెళ్లి ఊరేగింపు రథం
ABN , First Publish Date - 2021-10-25T05:54:21+05:30 IST
216 జాతీయ రహదారి ముమ్మిడివరం కాశివానితూముసెంటర్‌లో పంటకాల్వకు రక్షణగోడ లేకపోవడంతో పెళ్లి ఊరేగింపునకు తీసుకువెళ్తున్న రథం, గుర్రం ప్రమాదానికి గురయ్యాయి.

ముమ్మిడివరం, అక్టోబరు 24: 216 జాతీయ రహదారి ముమ్మిడివరం కాశివానితూముసెంటర్‌లో పంటకాల్వకు రక్షణగోడ లేకపోవడంతో పెళ్లి ఊరేగింపునకు తీసుకువెళ్తున్న రథం, గుర్రం ప్రమాదానికి గురయ్యాయి. శనివారం రాత్రి కాకినాడలో జరిగే వివాహానికి సంబంధించి పెళ్లి ఊరేగింపునకు సంబంధించి రథాన్ని, గుర్రాన్ని టాటా ఐషర్ వాహనంలో తీసుకువెళ్తున్నారు. జాతీయ రహదారి ముమ్మిడివరం కాశివానితూముసెంటర్ వద్దకు వచ్చే సరికి ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్‌టేక్ చేస్తుండగా ఐషర్ వాహనం పంట కాల్వలో బోల్తా పడింది. రథం, గుర్రం కాల్వలో పడిపోయాయి. పోలీసులు, ఫైర్‌సిబ్బంది సకాలంలో స్పందించి గుర్రా నికి తడులు కట్టి పైకితీసి ప్రాణాలు కాపాడారు. వాహనాన్ని, రథాన్ని కూడా పైకితీశారు. పంట కాల్వకు రక్షణ గోడ లేకపోవడంతో ఈప్రమాదం జరిగింది. వంతెనకు రక్షణగోడ లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక్కడ జరిగిన ప్రమాదంలో వాహన చోదకులు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలున్నాయి. ద్విచక్రవాహనాలు, కార్లు, భారీవాహనాలు వంతెన పైనుంచి కాల్వలో పడిపోయిన సంఘటనలున్నాయి. ప్రమాద హెచ్చరిక బోర్డు కూడా ఏర్పాటుచేయడం లేదా రక్షణగోడ నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.