మనుధర్మశాస్త్రం ప్రతుల దహనం
ABN , First Publish Date - 2021-12-26T06:08:28+05:30 IST
భారతీయ సమా జంలో అసమానతలు, వివక్షతకు మూలమైన మనుస్మృతి ప్రతులను శనివారం అమలాపురం గడియార స్తంభం సెంటర్‌లో దహనం చేశారు.

అమలాపురం టౌన్, డిసెంబరు 25: భారతీయ సమా జంలో అసమానతలు, వివక్షతకు మూలమైన మనుస్మృతి ప్రతులను శనివారం అమలాపురం గడియార స్తంభం సెంటర్‌లో దహనం చేశారు. భారత రిపబ్లికన్ పార్టీ జాతీయ కార్యదర్శి డీబీ లోక్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు ఎంఏకే భీమారావు, ఐఎన్ మల్లేశ్వరరావు, పెయ్యల పరశురాముడు, అయితాబత్తుల సుభాషిణి, పచ్చిమాల వసంతకుమార్, జడ్పీటీసీ పందిరి శ్రీహరి, పెయ్యల శ్రీనివాసరావు, జల్లి శ్రీనివాసరావు, ములపర్తి సత్యనారాయణ, పినిపే రాఽధాకృష్ణలు పాల్గొన్నారు.
తాళ్లరేవు: తాళ్లరేవు చెరువుగట్టు సెంటరులో ఎండీయూ డబ్ల్యూఏ, జనచైతన్యమండలి, కులవివక్ష పోరాట సంఘం ఆధ్వర్యంలో మనుధర్మశాస్త్రం ప్రతులను దహనం చేశారు. జనచైనత్య మండలి నాయకుడు కాశి రామారావు ఆధ్వర్యం లో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించి, ర్యాలీ నిర్వహించి సెంటరులో తగలబెట్టారు. దళిత సంఘం, జనచైతన్య మండలి, కెవీపీఎస్ నాయకులు పాల్గొన్నారు.