యువకుడి అదృశ్యంపై ఫిర్యాదు
ABN , First Publish Date - 2021-02-01T06:26:04+05:30 IST
యువకుడి అదృశ్యంపై తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొత్తపేటకు చెందిన మహ్మద్ అబ్దుల్ ఖాదర్ ఆప్టింగ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

కొత్తపేట, జనవరి 31: యువకుడి అదృశ్యంపై తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొత్తపేటకు చెందిన మహ్మద్ అబ్దుల్ ఖాదర్ ఆప్టింగ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈనెల 24న అతడు సీబీజెడ్ బైక్‌పై బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. దీనిపై తండ్రి ఖాశిం సాహెబ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉంది. రెండేళ్ల క్రితం కృష్ణా జిల్లా నందిగామలో అతడికి ఒక పెళ్లి సంబంధం చూశారు. అయితే అమ్మాయి తల్లిదండ్రులు ఈసంబంధానికి ఒప్పు కోలేదు. అయితే ఖాదర్ ఆ అమ్మాయితో ఫోన్‌లో మాట్లాడటంతో పాటు ఆమెను కలిసి వస్తుండేవాడు. అమ్మాయి తండ్రి షేక్ జాఫర్‌తో అబ్బాయి తండ్రి ఫోన్‌లో మాట్లాడగా తనకు, తన కుమార్తెకు సంబంధం లేదని చెప్పాడు. అమ్మాయితో మాట్లాడగా ఒక ఫ్రెండ్‌గానే చూశానని, మిగతా విషయాలు తనకు తెలియదని సమాధానం చెప్పింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు హెచ్‌సీ ఎం.వీర్రాజు తెలిపారు.