ఆత్రేయపురంలో రూ.250 కోట్లతో టూరిజం ప్రాజెక్టు
ABN , First Publish Date - 2021-10-29T06:55:46+05:30 IST
రాష్ట్రంలోని ఐదు ప్రాంతాల్లో లగ్జరీ రిసార్ట్‌ల నిర్మాణానికి భూమిని అప్పగిస్తూ గురువారం అమరావతిలో జరిగిన కేబినెట్ సమావేశం నిర్ణయించింది. ఓబెరాయ్ విలాస్ పేరుతో ఓబెరాయ్ సంస్థ నిర్మించే ఈ రిసార్ట్‌లలో ఒకటి ధవళేశ్వరం బ్యారేజీ దగ్గరలోని పిచ్చుకలంకలో నిర్మిస్తారు.

- పిచ్చుకలంకలో లగ్జరీ రిసార్ట్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
- కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం పలు నిర్ణయాలు
భానుగుడి(కాకినాడ), అక్టోబరు 28: రాష్ట్రంలోని ఐదు ప్రాంతాల్లో లగ్జరీ రిసార్ట్‌ల నిర్మాణానికి భూమిని అప్పగిస్తూ గురువారం అమరావతిలో జరిగిన కేబినెట్ సమావేశం నిర్ణయించింది. ఓబెరాయ్ విలాస్ పేరుతో ఓబెరాయ్ సంస్థ నిర్మించే ఈ రిసార్ట్‌లలో ఒకటి ధవళేశ్వరం బ్యారేజీ దగ్గరలోని పిచ్చుకలంకలో నిర్మిస్తారు. ఆత్రేయపురంలో రూ.250 కోట్లతో మరో టూరిజం ప్రాజెక్టు ఏర్పాటుచేసేందుకు నిర్ణయించారు. అలాగే జిల్లాకు సంబంధించి పి గన్నవరంలో కొత్త అగ్నిమాపక కేంద్రం ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. ఇక్కడ కొత్తగా 19 పోస్టులు కేటాయిస్తూ కూడా నిర్ణయం ప్రకటించారు. ఇక సినిమా టిక్కెట్లు అమ్మకాలకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటుచేయనున్న ఆన్‌లైన్ విధానం అమలుకోసం కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో జిల్లాలో ఉన్న 140 థియేటర్లకు సంబంధించిన టికెట్ బుకింగ్‌లు ప్రభుత్వ గుర్తింపు పొందిన యాప్‌లోనే తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే అమ్మ ఒడి పథకం పొందాలంటే ఈ ఏడాది నుంచే తప్పనిసరిగా 75 శాతం హాజరు ఉండాలనే నిర్ణయాన్ని అమలుచేయాలని నిర్ణయించారు. తొలు త దీన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తామని చెప్పారు.