నరసన్న కల్యాణోత్సవాలు ప్రారంభం

ABN , First Publish Date - 2021-03-24T05:43:52+05:30 IST

కోరుకొండ లక్ష్మీనర సింహస్వామి కల్యాణోత్సవాల మంగళవారం ప్రారంభమయ్యాయి. రాత్రి స్వామికి పుట్టమన్ను తెచ్చుట, అంకుర్పారణము, వాస్తు హోమం, ధ్వజారోహణ కార్యక్రమాలు నిర్వహిం చారు.

నరసన్న కల్యాణోత్సవాలు ప్రారంభం
పుట్టమన్ను తీసుకువస్తున్న దృశ్యం

  • ఘనంగా పుట్టమన్ను తెచ్చుట, అంకుర్పారణ, ధ్వజారోహణ 

కోరుకొండ, మార్చి 23: కోరుకొండ లక్ష్మీనర సింహస్వామి కల్యాణోత్సవాల మంగళవారం ప్రారంభమయ్యాయి. రాత్రి స్వామికి పుట్టమన్ను తెచ్చుట, అంకుర్పారణము, వాస్తు హోమం, ధ్వజారోహణ కార్యక్రమాలు నిర్వహిం చారు. ధ్వజారోహణ సమయంలో గరుడపటం నుంచి వచ్చే ప్రసాదం కోసం సంతానం లేని మహిళలు పైట చెంగులు చాపి ప్రసాదాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉభయ వేదాంత పండితులు ఆలయ అనువంశిక ధర్మకర్తలు పరాసర లక్ష్మీనరసింహ బట్టర్‌, పరాసర రంగరాజ బట్టర్‌, అర్చక స్వాముల ఆధ్వర్యంలో ధ్వజారోహణ కార్యక్రమం వైభవంగా జరిగింది.

నేడు రథోత్సవం, కల్యాణం..

కోరుకొండలో బుధవారం మధ్యాహ్నం 2గంటలకు స్వామి వారి రథోత్సవం జరుగుతుంది. రాత్రి 10గంటలకు లక్ష్మీనరసింహస్వామికి, అనంతపద్మనాభ స్వామికి ఒకే వేదిపై ఒకే సమయానికి రెండు కల్యాణాలు నిర్వహిస్తారు.

Updated Date - 2021-03-24T05:43:52+05:30 IST