10న జాతీయ లోక్‌ అదాలత్‌

ABN , First Publish Date - 2021-06-22T05:47:23+05:30 IST

జిల్లాలోని 15 ప్రాంతాల్లో ఉన్న న్యాయస్థానాల్లో వచ్చే నెల10న జాతీయ లోక్‌అదాలత్‌ నిర్వహిస్తున్నట్టు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.

10న జాతీయ లోక్‌ అదాలత్‌

రాజమహేంద్రవరం సిటీ, జూన్‌ 21: జిల్లాలోని 15 ప్రాంతాల్లో ఉన్న న్యాయస్థానాల్లో వచ్చే నెల10న జాతీయ లోక్‌అదాలత్‌ నిర్వహిస్తున్నట్టు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. రాజమహేంద్రవరం, అమ లాపురం, కాకినాడ, పెద్దాపురం, పిఠాపురం, రామచంద్రాపురం, రాజోలు, ఆల మూరు, తుని, ముమ్మిడివరం, కొత్తపేట, ప్రత్తిపాడు, అనపర్తి, రంపచోడ వరం, అడ్డతీగలలలోని న్యాయస్థానాల్లో జరిగే జాతీయ లోక్‌అదాలత్‌లో పెండింగ్‌లో ఉన్న సివిల్‌ తగాదాలు, యాక్సిడెంట్‌ కేసులు, బ్యాంకులు కేసలు, రాజీపడ్డ క్రిమినల్‌ కేసులు, ఫ్రిలిటికేషన్‌ కేసులు రాజీ మార్గం ద్వారా  పరిష్కరించుకోవచ్చని న్యాయమూర్తి తెలిపారు. 

Updated Date - 2021-06-22T05:47:23+05:30 IST