వెంకన్న ఆలయంలో పోటెత్తిన భక్తజనం

ABN , First Publish Date - 2021-03-14T06:46:28+05:30 IST

వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి పుణ్యక్షేత్రం శనివారం భక్తజన సంద్రమైంది.

వెంకన్న ఆలయంలో పోటెత్తిన భక్తజనం

స్వామివారి ఒక్క రోజు ఆదాయం రూ.10.97 లక్షలు

ఆత్రేయపురం, మార్చి 13: వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి పుణ్యక్షేత్రం శనివారం భక్తజన సంద్రమైంది. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వేకువజామునే సుప్రభాతసేవ, నీరాజన మంత్రపుష్పం, పుణ్యాహవచనం తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని పుష్పాలతో అలంకరించారు.  భక్తులు తలనీలాలు, కానుకలు సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వేలాది మంది స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. వివిధ సేవల ద్వారా స్వామివారికి ఒక్కరోజు ఆదాయం రూ.10,97,714 లభించింది. చైర్మన్‌ రమేష్‌రాజు, ఈవో సతీష్‌రాజు ఏర్పాట్లు పర్యవేక్షించారు.

బాలబాలాజీ ఆదాయం రూ.1,43,037

మామిడికుదురు, మార్చి 13: అప్పనపల్లి బాలబాలాజీ స్వామికి వివిధ ఆర్జిత సేవల ద్వారా రూ.1,47,037 వచ్చిందని సహాయ కమిషనర్‌ పి.బాబూ రావు తెలిపారు. దీనిలో అన్నదానట్రస్టుకు రూ.99,355 వచ్చిందన్నారు. 1,758 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్త కుండా ధర్మకర్తల మండలి చైర్మన్‌ పిచ్చిక చిన్నా, సిబ్బంది ఏర్పాట్లు చేశారు



Updated Date - 2021-03-14T06:46:28+05:30 IST