‘రుణాల మంజూరులో ప్రతిబంధకాలు తొలగించాలి’

ABN , First Publish Date - 2021-07-12T05:59:21+05:30 IST

రైతులు, చిన్నతరహా వ్యాపారస్తులకు బ్యాంకులు అందించే రుణాల మంజూరులో ప్రతి బంధకాలు తొలగించాలని టీడీపీ జిల్లా మాజీ కార్యదర్శి, రాజోలు నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు ఈలి శ్రీనివాస్‌ ఓ ప్రకటనలో కోరారు.

‘రుణాల మంజూరులో ప్రతిబంధకాలు తొలగించాలి’

మామిడికుదురు, జూలై 11: రైతులు, చిన్నతరహా వ్యాపారస్తులకు బ్యాంకులు అందించే రుణాల మంజూరులో ప్రతి బంధకాలు తొలగించాలని టీడీపీ జిల్లా మాజీ కార్యదర్శి, రాజోలు నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు ఈలి శ్రీనివాస్‌ ఓ ప్రకటనలో కోరారు.  సామాన్యుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడినప్పుడే సంస్కరణలకు ఫలితం ఉంటుందన్నారు.  బ్యాంకులు, సహకార, గ్రామీణ బ్యాంకులు, పరపతి సంఘాలు కఠిన నిబంధనలు విడనాడి చిన్న, సన్నకారు రైతులు, కౌలురైతులు, చిరు వ్యాపారులకు విరివిగా రుణాలు అందించి ఆదుకోవాలని కోరారు. బ్యాంకులు కఠిన నిబంధనలు విధించడంతో ప్రైవేటు వ్యక్తుల నుంచి అప్పులుచేసి అప్పుల పాలవుతున్నారని అన్నారు. Updated Date - 2021-07-12T05:59:21+05:30 IST