మద్యం, సారా స్వాధీనం
ABN , First Publish Date - 2021-02-06T06:56:40+05:30 IST
అక్రమ మద్యం కలిగి ఉన్న ఒక వ్యక్తిని రాయవరం పోలమ్మపుట్ట సమీపంలో అదుపులోకి తీసుకున్నట్లు రాయవరం స్పెషల్ ఎన్‌ఫోర్సుమెంట్ బ్యూరో స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఆర్.దొరబాబు తెలిపారు.

రాయవరం, ఫిబ్రవరి 5: అక్రమ మద్యం కలిగి ఉన్న ఒక వ్యక్తిని రాయవరం పోలమ్మపుట్ట సమీపంలో అదుపులోకి తీసుకున్నట్లు రాయవరం స్పెషల్ ఎన్‌ఫోర్సుమెంట్ బ్యూరో స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఆర్.దొరబాబు తెలిపారు. అతడి వద్ద నుంచి 10నిబ్బులు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. అనపర్తి మండలం కొప్పవరంలో ఒక వ్యక్తి నుంచి 4లీటర్ల సారా స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్టు తెలిపారు.