క్రీస్తు బోధనలు ఆచరణీయం

ABN , First Publish Date - 2021-12-25T05:36:56+05:30 IST

సర్వ ప్రాణులపట్ల కరుణ, దయ, ప్రేమ, సేవాభావం చూపాలంటూ ఏసుక్రీస్తు చేసిన బోధనలు ఆచరణీయమని యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్‌ అన్నారు.

క్రీస్తు బోధనలు ఆచరణీయం

 యానాం ఎమ్మెల్యే అశోక్‌

 ఘనంగా ముందస్తు క్రిస్మస్‌ వేడుకలు 

ముస్తాబైన చర్చిలు

నడకుదురు(కరప), డిసెంబరు 24: సర్వ ప్రాణులపట్ల కరుణ, దయ, ప్రేమ, సేవాభావం చూపాలంటూ ఏసుక్రీస్తు చేసిన బోధనలు ఆచరణీయమని యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్‌ అన్నారు. నడకుదురు నూతన యెరూసలేం ప్రార్థనా మందిరంలో పాస్టర్‌ రెవరెండ్‌ డాక్టర్‌ జె.పాల్‌ప్రసాద్‌ నిర్వహించిన క్రిస్మస్‌ ఆరాధన వేడుకల్లో ఆయన మాట్లాడారు. కుడా చైర్మన్‌ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, కురసాల సత్యనారాయణ, జడ్పీటీసీ యాళ్ల సుబ్బారావు, ఎంపీపీ పెంకే శ్రీలక్ష్మిసత్తిబాబు, మాజీ ఎంపీటీసీ జవ్వాది సతీష్‌, దాలిపర్తి శ్రీనివాస్‌, జువ్వల చిన్నారావు పాల్గొన్నారు.

సర్పవరం జంక్షన్‌: ఏసుక్రీస్తు బోధనలు ప్రపంచ మానవాళికి అనుసరణీయమని శ్రీచైతన్య పాఠశాల ప్రధానోపాధ్యాయులు శైలజ అన్నారు. శుక్రవారం సర్పవరం జనచైతన్య లేఅవుట్‌లో శ్రీచైతన్య టెక్నో పాఠశాల్లో రీజినల్‌ ఇన్‌చార్జి గోపీనాధ్‌ ఆధ్వర్యంలో క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు సాంస్కృతిక నృత్య ప్రదర్శన చేశారు. పలు రకాల వేషధారణలతో ఆకట్టుకున్నారు. ప్రైమరీ ఇన్‌చార్జి హారిక, రోజా పాల్గొన్నారు. సర్పవరానికి చెందిన జీసస్‌ మినిస్ట్రీస్‌ ఫౌండర్‌ వెన్నపు ప్రసాద్‌పాల్‌ ఆధ్వర్యంలో కాకినాడలో శుక్రవారం ముందస్తు క్రిస్మస్‌ వేడుకలు నిర్వహించారు. ఈసందర్భంగా 300మంది విద్యార్థులకు స్టీల్‌ బాక్స్‌లను వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి జమ్మలమడక నాగమణి పంపిణీ చేశారు. రామశర్మ పాల్గొన్నారు. 

భానుగుడి (కాకినాడ): నగరంలో పలు పాఠశాలల్లో క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్నారులు ఆటల పాటల తో సాంస్కృతిక నృత్యాలు ఆకట్టుకున్నాయి. అశోక్‌నగర్‌ రవీం ద్రభారతి స్కూల్‌ ప్రిన్సిపాల్‌ షీలాబాబు ఆధ్వర్యంలో క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాకినాడ రామా రావుపేట ఆక్స్‌ఫర్డ్‌ స్కూల్లో ప్రిన్సిపాల్‌ నీలిమ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్‌ వేడుకల్లో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆక ట్టుకున్నాయి. ఈ సందర్భంగా  కరస్పాండెంట్‌ విజయ్‌, ధర్మ విద్యార్థులకు ప్రత్యేక బహుమతులు అందజేశారు. జగన్నా ఽథపురం చర్చిస్క్వేర్‌లో ఉన్న ఎఫెక్స్‌ స్కూల్లో కరస్పాండెంట్‌ బేగ్‌ ఆధ్వర్యంలో క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. జగన్నా థపురం సురేష్‌ స్కూల్లో కరస్పాం డెంట్‌ సురేష్‌ ఆధ్వర్యంలో క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్నారులు ప్రదర్శించిన ప్రత్యేక నాటిక ఆకట్టుకుంది.  

కాకినాడ క్రైం: కాకినాడ అశోక్‌నగర్‌ రవీంద్రభారతి స్కూల్లో ప్రిన్సిపాల్‌ షీలాబాబు ఆధ్వర్యంలో శుక్రవారం క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరిగాయి.  ఏజీఎం బి.వెంకట్‌ ఏసుక్రీస్తు సందేశం ఇచ్చారన్నారు.  చిన్నపిల్లలు, విద్యార్థులు నిర్వహించిన పలు సంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. 

పిఠాపురం: పిఠాపురం పట్టణంలోని పలు పాఠశాలల్లో శుక్రవారం క్రిస్మస్‌ సంబరాలు జరిగాయి. చిన్నారులు క్రిస్మస్‌ వేషధారణలో సందడి చేశారు. పట్టణంలో భాష్యం స్కూలు, ఆదిత్య స్కూలు ఆవరణలో జరిగిన కార్యక్రమాల్లో క్రిస్మస్‌ ప్రాధాన్యం గురించి ఉపాధ్యాయులు వివరించారు.

జగ్గంపేట: మండలంలోగల చర్చిలు విద్యుత్‌ అలంకరణ లతో ముస్తాభయ్యాయి. శుక్రవారం రాత్రి పలువురు ప్రత్యేక ప్రార్ధనలు, కీర్తనలు చేశారు. క్రిస్మస్‌ సందర్భంగా క్రైస్తవుల ఇంట పండుగ వాతావరణం నెలకొంది.  అలాగే రవీంద్ర భారతి స్కూల్‌లో క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా నిర్వహించా రు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిఽథిగా రవీంధ్రభారతి స్కూ ల్‌ రాజమహేంద్రవరం డివిజన్‌ ఏటీఎం నగోడు రవికు మార్‌ పాల్గొన్నారు. ప్రిన్సిపాల్‌ కందుల శ్వేత పిల్లలకు క్రిస్మస్‌ సందేశాన్నిచ్చారు.

కిర్లంపూడి: మండలంలో పలు గ్రామాలలో క్రీస్తు సంఘం వారి ఆధ్వర్యంలో క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నా రు. క్రిస్మస్‌ సందర్భంగా పాస్టర్లు పలు సందేశాలు అందిం చారు. ఈసందర్భంగా సంఘ సభ్యులు క్రిస్మస్‌ కేక్‌ను కట్‌చేసి వేడుక చేసుకున్నారు. ఎస్సీపేట, చిల్లంగి, జగపతినగరం గ్రా మాలలో ప్రార్థనామందిరాల్లో  క్రిస్మస్‌వేడుకలు నిర్వహించారు. 

గండేపల్లి : ఆదిత్య కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ టెక్నాలజీ నం దు క్రిస్మస్‌ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్ర మానికి కాకినాడకు చెందిన పాస్టర్‌ పి.మోసెస్‌ వెస్టీ ముఖ్య అతిఽథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ టీకే రామకృష్ణ, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ పి.వేణు గోపాల్‌, సిబ్బంది పాల్గొన్నారు.

ప్రత్తిపాడు: ప్రేమ, శాంతి, క్షమ, దయాగుణాల పెంపుదల కోసం అవతరించిన కరుణామయుడు ఏసుప్రభువు అని రాష్ట్ర సాహిత్య అకాడమీ డైరెక్టర్‌ మారిశెట్టి శివకుమార్‌ అన్నారు. మండలంలోని ధర్మవరం జెరుసలేం ప్రార్థనా మందిరంలో శుక్రవారం జరిగిన క్రిస్మస్‌ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ప్రార్థనా మందిరం నిర్వాహకుడు అంబటి భీమరా జు, క్రీస్తవ సోదరులు రాపా గుర్రాజు, విద్యాకమిటీ చైర్మన్‌ అంబటి ఏసుబాబు కలిసి శివకుమార్‌ను సన్మానించారు.

ఏలేశ్వరం: పట్టణంలో భాష్యం హైస్కూల్‌లో శుక్రవారం క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్‌ గొల్లపల్లి అనిల్‌కుమార్‌ నేతృత్వంలో . చిన్నారులకు వివిధ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో భాష్యం విద్యాసంస్థల చైర్మన్‌ శ్రీరామకృష్ణ, జోనల్‌ ఇన్‌చార్జి గోవిందరాజులు, ప్రైమరీ పాఠశాల ప్రిన్సిపాల్‌ ఉషారాణి విద్యార్థులకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు.Updated Date - 2021-12-25T05:36:56+05:30 IST