కొండ అలుగు చిప్పలు, దుప్పి కొమ్ములు స్వాధీనం
ABN , First Publish Date - 2021-01-26T05:53:27+05:30 IST
గోకవరం, జనవరి 25: మండలంలోని మల్లవరంలో ఒక వ్యక్తి ఇంట్లో ఉన్న కొండ అలుగు చిప్పలు, దుప్పి కొమ్ము లు స్వాధీనం చేసుకున్నట్టు అ
గోకవరం, జనవరి 25: మండలంలోని మల్లవరంలో ఒక వ్యక్తి ఇంట్లో ఉన్న కొండ అలుగు చిప్పలు, దుప్పి కొమ్ము లు స్వాధీనం చేసుకున్నట్టు అటవీ క్షేత్రాధికారి ఎం.కరుణాకర్ సోమవారం తెలిపారు. చోడిపల్లి చిన్నబ్బు అనే వ్యక్తి తన మేడపై కొండ అలుగు చిప్పల ప్యాకెట్లను, దుప్పి కొమ్మును, బైండింగు వైరు ఉచ్చులు ఉండటం గుర్తించి అతడికి అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితుడు గతంలో రెండుసార్లు వన్యప్రాణులను వేటాడుతూ పట్టుబడ్డాడని ఆయన తెలిపారు. దాడిలో సెక్షన్ ఆఫీసర్ ఎస్.వీరభద్రరావు, భూపాల్ బీటు అధికారలు, ఎం.శ్రీనువాసరావు, బి.శ్రీనివాసరావు, ఎస్.బసవయ్య, ఎం.నరసన్నదొర, ఎల్.బి.మాణిక్యం, వెంకటరమణ పాల్గొన్నారు.