విచక్షణ, వివేకంతో నిర్ణయాలు తీసుకోవాలి
ABN , First Publish Date - 2021-09-17T05:25:44+05:30 IST
విచక్షణ, వివేకంతో నిర్ణయాలు తీసుకునే శక్తి ద్వారానే మహిళా సాధికారిత విజయవంతమవుతుందని కందుకూరి రాజ్యలక్ష్మి స్ర్తీల కళాశాల ప్రిన్సిపాల్ పి.రాఘవకుమారి అన్నారు.
రాజమహేంద్రవరం అర్బన్, సెప్టెంబరు 16: విచక్షణ, వివేకంతో నిర్ణయాలు తీసుకునే శక్తి ద్వారానే మహిళా సాధికారిత విజయవంతమవుతుందని కందుకూరి రాజ్యలక్ష్మి స్ర్తీల కళాశాల ప్రిన్సిపాల్ పి.రాఘవకుమారి అన్నారు. గురువారం కళాశాలలో మహిళా సాధికారత-హక్కులపై అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సుకు అధ్యక్షత వహించిన ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థినులు రోల్ సెట్టింగ్‌తోపాటు గోల్ సెట్టింగ్ కూడా అలవర్చుకుని ముందంజలో సాగాలని ఆకాంక్షించారు. విశాఖపట్నానికి చెందిన విద్యావేత్త రహీమున్నీసా బేగం మాట్లాడుతూ నకిలీ ప్రేమల భ్రాంతితో కన్న తల్లిదండ్రులను, తోబుట్టువులను మోసపుచ్చవద్దని సూచించారు. వివిధ మహిళా చట్టాల అమలులో లోపాలు తెలియజేస్తూ వాటి పట్ల అవగాహన కల్పించారు. సదస్సులో ఎన్‌ఎస్‌ఎస్ అధికారులు ఉమాజ్యోతి, కేఎస్ అన్నపూర్ణ, చిన్నిబాబు పాల్గొన్నారు.