టీడీపీ అభ్యర్థుల గెలుపునకు పనిచేయాలి

ABN , First Publish Date - 2021-02-27T05:28:42+05:30 IST

తుని, ఫిబ్రవరి 26: మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల గెలుపు కోసం పార్టీ శ్రేణులంతా కష్టపడి పనిచేయాలని కాకినాడ పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుడు జ్యో

టీడీపీ అభ్యర్థుల గెలుపునకు పనిచేయాలి
జ్యోతుల నవీన్‌ను సన్మానిస్తున్న యనమల కృష్ణుడు

పార్లమెంట్‌ అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌ 

తుని, ఫిబ్రవరి 26: మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల గెలుపు కోసం పార్టీ శ్రేణులంతా కష్టపడి పనిచేయాలని కాకినాడ పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌ పిలుపు నిచ్చారు. తుని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం కార్యకర్తల సమావేశంలో నవీన్‌ మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రస్తుతం నిత్యావసర ధరలపై మహిళలకు వివరించాలన్నారు. ఎన్నికల ముందు మద్యంపాన నిషేధం చేస్తానన్న జగన్‌ ఇప్పుడు అధిక ధరలకు మద్యం అమ్ముకుని పేదలను దోచుకుంటున్నారని విమర్శించారు. ఇళ్ల స్థలాల్లో అక్రమాలకు పాల్పడి కోట్ల నిధులు కాజేశారన్నారు. టీడీపీ అధికారంలో ఉండగా దేశంలో ఎక్కడాలేని విధంగా పెట్రోలు ధరలు పెంచారంటూ ఊదరగొట్టిన జగన్‌, ఇప్పుడు లీటర్‌ సెంచరీకి చేరినా ఎందుకు మాట్లాడడం లేదని నవీన్‌ ప్రశ్నించారు. తుని నియోజకవర్గ ఇన్‌చార్జి యనమల కృష్ణుడు మాట్లాడుతూ ము న్సిపల్‌ ఎన్నికల్లో అందరు సమష్టిగా కృషి చేయాలన్నారు. అనంతరం నవీన్‌కు దుశ్శాలువా కప్పి సన్మానించారు. మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ యినుగంటి సత్యనారాయణ, సుర్ల లోవరాజు, పోల్నాటి శేషగిరిరావు, దంతులూరి శ్రీనివాస్‌, కోడా రమణ, నడిగట్ల సూ రిబాబు, కూరపాటి రఘు, అభ్యర్థులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-27T05:28:42+05:30 IST